AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు. ఎవరెవరు ఎక్కడికంటే!

 AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు. ఎవరెవరు ఎక్కడికంటే!

AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు. విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. సీసీఎల్‌ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రంజిత్‌ బాషాను విజయవాడ కమిషనర్‌గా బదిలీ చేశారు. కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న రేఖారాణిని కాపు కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేశారు. కాపు కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న అనంతరామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు

సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కె.సునీతను మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గంధం చంద్రుడిని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. ఏపీ భవన్‌ ప్రత్యేక అధికారిగా అక్కడ అదనపు కమిషనర్‌గా ఉన్న హిమాన్షు కౌశిక్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ భవన్‌ ప్రత్యేక అధికారి ఎన్‌వీ రమణారెడ్డిని ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈవోగా నియమించారు. ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈఓగా ఉన్న ఆర్‌. పవన్‌మూర్తిని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా నియమించారు.

Flash...   Insta 360 నుంచి కొత్త యాక్షన్ కెమెరాలు వచ్చేసాయి ! ధర,స్పెసిఫికేషన్లు ఇవే..