AP PRC: ఏపీలో ఇంకా కొలిక్కిరాని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు…CMO చుట్టూ తిరుగుతున్న జేఏసీ!

 AP PRC: ఏపీలో ఇంకా కొలిక్కిరాని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు.. సీఎంవో చుట్టూ తిరుగుతున్న జేఏసీ!

Andhra Pradesh Government Employees demands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల(Government Employees)కు జగన్(YS Jagan) సర్కార్ సంక్రాంతి కానుకగా పీఆర్సీ(PRC) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జీతభత్యాల విషయంలో కొన్ని డిమాండ్లు ఇంకా కొలిక్కి రాలేదు. వారి సమస్యలను పరిష్కారించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) చుట్టూ తిరిగుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అంశంపై మొన్న రాత్రి వరకు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలు, నిన్న మరోసారి సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులంతా అసంతృప్తిగా ఉన్న వేళ, గత ప్రభుత్వం కల్పించిన రాయితీల్లో కోతలు వేయడం సరికాదన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. సంక్రాంతి పండగ అయిపోయే వరకు HRA సహా ఇతర అంశాలకు సంబంధించిన జీవోలు విడుదల చేయబోమని సీఎంవో అధికారులు తేల్చి చెప్పినట్టు తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు. 

తాజాగా వివిధ అంశాలపై సీఎంఓ అధికారులతో చర్చించారు ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు. హెచ్‌ఆర్‌ఏపై అధికారుల నుంచి స్పష్టత రాలేదన్నారు బండి శ్రీనివాసులు, బొప్పరాజు వెంకటేశ్వర్లు. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హెచ్‌ఆర్‌ఏ స్లాబులను కేంద్ర ప్రభుత్వ స్లాబులతో పోల్చడం వల్ల సచివాలయ హెచ్‌వోడీ ఉద్యోగులు 22 శాతం, జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులు దాదాపు 12 శాతం, మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు 6.5 శాతం, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 4.5శాతం హెచ్‌ఆర్‌ఏ కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పీఆర్‌సీతో జీతాలు పెరగక పోగా తగ్గుతున్నాయని చెప్పినట్టు వెల్లడించారు బండి శ్రీనివాసులు, బొప్పరాజు వెంకటేశ్వర్లు. సీఎంతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారని వెల్లడించారు నేతలు. సంక్రాంతి తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యల ఆధారంగా ఉద్యోగుల కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.

Flash...   Amazon One: Palm scanner launched for 'secure' payments