AP PRC: పీఆర్సీ ససమ్మె లోకి మేము రాము : ఆర్టీసీ వైఎస్సార్‌ ఉద్యోగ సంఘం

 AP PRC: పీఆర్సీ సమ్మెలో పాల్గొనబోం: ఆర్టీసీ వైఎస్సార్‌ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చంద్రయ్య


ఈనాడు, అమరావతి: ఆర్టీసీ రథ చక్రాలు ఆగితేనే సమ్మె ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే తమను భాగస్వాములను చేసేందుకు పీఆర్సీ సాధన సమితి ప్రయత్నిస్తోందని ఆర్టీసీ (పీటీడీ) వైఎస్సార్‌ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య విమర్శించారు. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహకవర్గ సమావేశం అనంతరం చంద్రయ్య విలేకర్లతో మాట్లాడారు.

READ

ఫిబ్రవరి నెలలోSBI శాలరీ అకౌంట్ ఉన్నవారు ఒక లక్ష వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇంటి నుంచే పొందొచ్చు 

SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

తాము పీఆర్సీ సాధన సమితి సమ్మెలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. పీఆర్సీ అమలైతేనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నామన్నారు. 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో 14వేల మందికి పైగా తమ సంఘంలో సభ్యులుగా ఉన్నారన్నారు. ఆర్టీసీలో 80 శాతానికి పైగా సాధారణ ఉద్యోగులు ఈ సమ్మెను వ్యతిరేకిస్తారని భావిస్తున్నామన్నారు. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ఉపాధ్యక్షులు జె.ఎం.నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహం మాట్లాడుతూ తాము ప్రతి జిల్లాకు తిరిగి సమ్మెను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. 75 డిమాండ్లలో ఆర్టీసీకి సంబంధించినవి ఎన్ని ఉన్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Flash...   PF Withdrawal: PF ఉపసంహరిస్తున్నారా? మీకు ఆ అర్హత ఉంటేనే సాధ్యం.. వివరాలివే..!