BIG ALERT: SBI బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు వాడకూడని యాప్స్ ఇవే..!

 

SBI బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు వాడకూడని యాప్స్ ఇవే..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్

మోసపూరితమైన ఈ యాప్స్ ని SBI కస్టమర్లు వారి ఫోన్లలో వాడొద్దని తెలిపింది

ఈ యాప్స్ ను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు అలర్ట్ జారీచేసింది. ఈ అలర్ట్ చాలా కాలంగా తన కస్టమర్ల కోసం SBI ప్రకటించింది. SBI  కస్టమర్లు ఉపయోగించే మొబైల్స్ లో కొన్ని యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీచేసింది. ఈ యాప్స్ వలన 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు, అటువంటి మోసపూరితమైన ఈ యాప్స్ ని SBI కస్టమర్లు వారి ఫోన్లలో వాడొద్దని తెలిపింది. అంతేకాదు, ఈ యాప్స్ ను Install చేసుకుంటే మోసగాళ్లు మీ అకౌంట్ ను ఖాళీ చేస్తారని సూచించింది.

ALSO READ: 

Online లో సుల‌భంగా SBI ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్‌ లోన్స్‌

SBI కీలక నిర్ణయం.. మనీ ట్రాన్స్‌ఫర్‌పై కొత్త ఛార్జీలు

స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్…వడ్డీ రేట్లు పెంపు ..!

విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని, ఎనిడెస్క్ (Anydesk), క్విక్ సపోర్ట్ (Quick Support), టీమ్ వ్యూవర్ (Teamviewer) మరియు మింగిల్ వ్యూ (Mingleview) యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది

అంతేకాదు, ఏదైనా గుర్తుతెలియని ఒరిజిన్ నుండి ఏదైనా UPI కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలిపింది అలాగే, SBI వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, ఆన్లైన్లో ఆరు కంటే పైచిలుకు నకిలీ SBI వెబ్ సైట్స్ ఉన్నాయి. అందుకే, ఏదైనా పరిస్కారం కోసం సంప్రదించవలసిన సమయంలో సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి.

SBI OFFICIAL WEBSITE

SBI PERSONAL BANKING

Flash...   Unlock 4.0 Guidelines for Phased Reopening in the State of Andhra Pradesh