BREAKING: ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం!.. ఒకట్రెండు రోజుల్లో 26 జిల్లాలకు నోటిఫికేషన్‌

 ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం!.. ఒకట్రెండు రోజుల్లో 26
జిల్లాలకు నోటిఫికేషన్‌

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి
ప్ర‌క్రియ ప్రారంభ‌ం కాబోతోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్ర‌భుత్వం
నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. ప్ర‌తి లోక్‌స‌భ  నియోజ‌క
వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో
వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేర్చే దిశగా
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు అడుగులు
వేస్తున్నారు.

ఎట్ట‌కేల‌కు ఈ హామీకి సంబంధించిన నోటిఫికేష‌న్ జారీ అవుతోంది. రేపు లేదా
ఎల్లుండి.. రెండురోజుల్లో నోటీఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ
వ‌ర్గాల స‌మాచారం. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాలుంటే.. 26
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేదిశ‌గా ప్ర‌క్రియ‌ ప్రారంభ‌మైన‌ట్టు
స్ప‌ష్ట‌మ‌వుతోంది. అర‌కు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ భౌగోళిక రిత్యా చాలా
విస్తార‌మైనది కావ‌డంతో.. ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే
అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అక్క‌డ‌క్క‌డ భౌగోళిక ప‌రిస్థితుల‌ను
ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు- చేర్పులు ఉంటాయని
తెలుస్తోంది. 

పెరిగిన జ‌నాభాకు అనుగుణంగా ప‌రిపాల‌నను ప్ర‌జ‌ల‌కు చేరువ
చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవ‌స‌ర‌మ‌ని
ఇంతకు ముందు వైసీపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది కూడా. అందుకు అనుగుణంగా ఈ
ప్ర‌క్రియ‌కు అన్ని విధాలుగా సిద్ధ‌మ‌వుతోంది.

Flash...   APలో PRC రగడకు పడని ఎండ్‌కార్డ్‌..!