CARONA IN SCHOOLS: స్కూళ్ల‌లో క‌రోనా క‌ల‌క‌లం.. 10 శాతం కేసులు అక్క‌డే..

 స్కూళ్ల‌లో క‌రోనా క‌ల‌క‌లం.. 10 శాతం కేసులు అక్క‌డే..

క‌రోనా థ‌ర్డ్‌వేవ్ విరుచుకుప‌డుతోంది.. దేశ‌వ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలోనూ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఇక‌, స్కూళ్ల‌పై పంజా విసురుతోంది మ‌హ‌మ్మారి.. ప్ర‌కాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొన‌సాగుతోంది.. తాజాగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు క‌రోనా పొజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల త‌ర్వాత అమాంతం కొత్త కేసులు పెరుగుతూ పోతున్నాయి.. గత ఐదు రోజుల్లో ప్ర‌కాశం జిల్లాలోని స్కూళ్ల‌లో 147 మందికి పైగా క‌రోనా సోకిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు..

ALSO SREAD

SSC EXAMINATIONS 2022 – FEE DUE DATES AND SCHEDULE

SA – 1 REVISED TIMETABLE

పశ్చమ గోదావరి జిల్లలో సైతం గత సోమవారం నుంచి నిన్నటి వరకు 58 మంది టీచర్ లు ఇద్దరు విద్యార్థులు కోవిద్ బారిన పడినారు . ఈ జిల్లలో కూడా కేసులు శరవేగం గా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం . నిన్న ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా 772 కరోనా కేసులు న‌మోదు కాగా.. అందులో 10 శాతం కేసులు పాఠ‌శాల‌ల్లో న‌మోదు అయిన‌వే కావ‌డం క‌ల‌వ‌ర‌పెట్టే అంశం.. రోజురోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో అటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొద‌లైంది.. కరోనా ఉధృతి తగ్గేవరకు పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. కాగా, కోవిడ్ ఉధృతి కార‌ణంగా చాలా రాష్ట్రాలు స్కూళ్ల‌కు సెల‌వులు ఇచ్చాయి.. కానీ, ఏపీలో ఆ డిమాండ్ వినిపిస్తున్నా.. విద్యార్థుల భ‌విష్య‌త్ దృష్ట్యా.. సాధ్యం కాద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.. మ‌రోవైపు, ఇప్ప‌టికే స్కూళ్లు మూసివేసిన రాష్ట్రాల‌కు కూడా మ‌ళ్లీ తెరిచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Flash...   Amma Vodi Implementation Guidelines 2021