Corona Virus: కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందా?.WHO ఏమంటుందో తెలుసా..

 Corona Virus: కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందా?..ఒమిక్రాన్‌పై  WHO ఏమంటుందో తెలుసా.. 

Corona Virus: 2019 డిసెంబర్ నెలలో చైనా (China)లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి.. గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. కోవిడ్ రోజుకో రూపం ధరంచి ప్రపంచ దేశాలలో గత రెండేళ్లుగా కల్లోలం సృష్టిస్తోంది. అయితే ఈ  కరోనా(Corona) మహమ్మారి అంతం కాబోతుందా.. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron)విస్తృవ్యాప్తే దీనికి సంకేతమా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోప్ విభాగం సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్-19 మహమ్మారిని కొత్త దశకు తీసుకెళ్లిందని, ఐరోపాలో ముగింపునకు చేరుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ యూరప్ విభాగం డైరెక్టర్ హాన్స్ క్లూగే వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో చివరి దశవైపు మహమ్మారి కదులులున్నట్లు ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మార్చి నాటికి ఐరోపాలో 60 శాతం మంది ఒమిక్రాన్ బారినపడే అవకాశం ఉందన్నారు. ‘ప్రస్తుతం ఐరోపా అంతటా ఉప్పెనలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గిన తర్వాత, కొన్ని వారాలు, నెలలపాటు వైరస్‌ సోకినవారిలో రోగనిరోధక శక్తి ఉంటుందని తెలిపారు. కాలానుగుణంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని తెలిపారు.

Voice : ‘కోవిడ్ -19 ఈ ఏడాది చివరి నాటికి మళ్లీ వ్యాప్తిచెందుతుందని, అయితే ఆతర్వాత మహమ్మారి తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు’ అని క్లూగే చెప్పారు. అమెరికాకు చెందిన సైంటిస్ట్ ఆంథోనీ ఫౌచీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జనవరి చివరి వారంలో అమెరికాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని, పరిస్థితులు కుదుటపడతాయని ఫౌచీ అన్నారు. ఇక, డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయం కూడా జనవరి రెండో వారంలో అక్కడ కోవిడ్ కేసులు క్షీణించాయని, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో నాలుగో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుంచి మరణాలు మొదటిసారిగా తగ్గుతున్నాయని పేర్కొంది. కాగా కోవిడ్ -19 ఒక మహమ్మారి దశనుంచి సీజనల్ ఫ్లూ వంటి స్థానిక వ్యాధిగా మారినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలని క్లూగే చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ యూరోపియన్ కమీషనర్ ఫర్ ఇంటర్నల్ మార్కెట్స్‌కు చెందిన థియరీ బ్రెటన్ మాట్లాడుతూ.. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లను కొత్త వేరియంట్లకు అనుగుణంగా మార్చడం సాధ్యమవుతుందని చెప్పారు. వ్యాక్సిన్‌లు ముఖ్యంగా mRNAలను అవసరమైతే మరింత వైరలెంట్ వేరియంట్‌లకు అనుగుణంగా మార్చడానికి తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు.

Flash...   JVK 4 Distribution Instructions to all field functionaries