Gadget kids: పిల్లల కళ్లపై గాడ్జెట్స్‌ ఎఫెక్ట్..

పిల్లల కళ్లపై గాడ్జెట్స్‌ ఎఫెక్ట్.. ఈ టిప్స్ పాటిస్తే మంచిదంటోన్న నిపుణులు..

Health Tips: కరోనా(Coronavirus) మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఆన్‌లైన్ తరగతుల(Online Classes) ట్రెండ్ కొనసాగుతోంది. పిల్లలు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్‌లో ఆటలు ఆడటం కూడా విపరీతంగా పెరిగిపోయింది. పగలు, రాత్రి తేడాలేకుండా అందులో మునిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 24 గంటల పాటు స్క్రీన్‌ ముందు ఉండడం వారి కళ్లపై ప్రభావం చూపుతుందనేది ఆందోళన కలిగించే అంశం. డిజిటల్ స్క్రీన్స్‌పై ఎక్కువ కాలం ఉంటే మాత్రం భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దాదాపు 40శాతం మంది పిల్లల కళ్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఇటీవల ఒక పరిశోధనలో వెల్లడైంది. తల్లిదండ్రులు సకాలంలో పిల్లలపై శ్రద్ధ వహిస్తే, వారిని తీవ్ర వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. మీ పిల్లల కళ్ల(Children Health)ను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

READ

ఫిబ్రవరి నెలలోSBI శాలరీ అకౌంట్ ఉన్నవారు ఒక లక్ష వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇంటి నుంచే పొందొచ్చు 

SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

తల్లిదండ్రులు తమ పిల్లల దృష్టిలో ఏదైనా సమస్య ఉన్నట్లు అనిపిస్తే, వెంటనే డాక్టర్ చేత చెకప్ చేయించాలని నిపుణులు అంటున్నారు. ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తరుచుగా పిల్లల కళ్లు చెక్ చేస్తుండాలి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లల స్క్రీన్ టైమింగ్‌ను తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువసేపు స్క్రీన్‌పై ఉండటం వల్ల పిల్లల కళ్లు చాలా బలహీనపడతాయి. ఇందుకు మారుగా పెద్ద స్క్రీన్‌పైనే క్లాస్‌లను చూసేలా ఏర్పాటు చేయాలి. అదే సమయంలో, వారి ఆహారంలో పోషకమైన పండ్లు, కూరగాయలను చేర్చాలి. మీరు మీ పిల్లల ఆహారంలో ఈ వస్తువులను చేర్చినట్లయితే, ఈ ఆహారాలు పిల్లల కళ్లపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.

వ్యాయామం చేపిస్తే బెటర్.. వ్యాయామం చేయడం వల్ల పిల్లలను ఫిట్‌గా మార్చవచ్చు. ముఖ్యంగా పిల్లల కళ్లతోపాటు వేళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేయించవచ్చు.  పిల్లల కాన్సంట్రేషన్‌‌ను పెంచువచ్చు.

Flash...   SBI RD Scheme: ఆ పథకంలో పెట్టుబడితో అదిరిపోయే వడ్డీ.. SBI అందించే RD స్కీమ్‌ వివరాలు తెలుసుకోవాల్సిందే..!

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.