Internet In 2021: ఇంటర్నెట్.. కేవలం ఒక్క నిమిషంలో జరిగే విధ్వంసం గురించి తెలుసా?
ఇంటర్నెట్ ఒక గ్లోబల్ కంప్యూటర్ నెట్‌వర్క్. ఈ భూమ్మీద అతిపెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ. యూజర్లకు వివిధ రకాల సమాచారంతో పాటు పరస్పర సంభాషణల కోసం సౌకర్యాలు అందిస్తున్న వేదిక. అలాంటి వేదికపై ఒక్క నిమిషంలో జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో తెలుసా?
చదవండి : Reliance Jio: మరొక జబర్దస్త్ అఫర్ ప్రకటించిన జియో..!
వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్‌సైట్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వివిధ ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్స్(సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కలిపి)లో ఒక్క నిమిషంలో ఏమేం జరిగిందో వివరించింది. బ్రౌజింగ్, స్ట్రీమింగ్, అప్‌లోడ్, డౌన్‌లోడ్.. ఇలా మొత్తం వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించి లోరీ లూయిస్ అనే ఆవిడ.. ఈ వివరాల్ని ఆల్‌యాక్సెస్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వీటి ఆధారం ఏం తేలిందంటే..
Read: కొత్త పీఆర్సీ లో మీ జీతం ఎంత పెరిగింది ఇక్కడ చూసుకోండి
➧ యూట్యూబ్.. 500 గంటల నిడివి ఉన్న కంటెంట్ కేవలం ఒక్క నిమిషంలోనే అప్‌లోడ్ అయ్యింది.
➧ ఇంటర్నెట్‌లో 197 మిలియన్లకు పైగా ఈమెయిల్స్ పంపించుకుంటున్నారు.
➧ వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్‌లలో నిమిషానికి 69 మిలియన్ల మెసేజ్‌లు పంపించుకున్నారు.
➧ ఇన్‌స్టాగ్రామ్‌లో నిమిషానికి దాదాపు ఏడు లక్షల స్టోరీలు షేర్ అవుతున్నాయి.
➧ ప్రొఫెషనల్ సైట్ లింక్డిన్‌లో సుమారు పదివేల మంది కనెక్ట్ అవుతున్నారు.
➧ టిక్‌టాక్ లాంటి వీడియో కంటెంట్ జనరేటింగ్ యాప్‌లో ఐదు వేల డౌన్‌లోడ్‌లు చేస్తున్నారు
➧ నెట్‌ఫ్లిక్స్‌లో నిమిషానికి 28 వేలకు పైగా సబ్‌స్క్రయిబర్స్ వీక్షణ కొనసాగుతోంది.
నోట్: మరికొన్ని అంశాలపై పరిశోధన జరిగినప్పటికీ.. పూర్తి స్థాయి లెక్కలు తేలకపోవడంతో ఈ లిస్ట్‌లో జత చేర్చలేదు. ఆన్‌లైన్ షాపింగ్, మరికొన్ని ప్లాట్‌ఫామ్‌ల వివరాలు పొందుపర్చలేదు. ఇది కేవలం ఆల్‌యాక్సెస్ డేటా మాత్రమే!.
►ఇంటర్నెట్ ఉపయోగం వల్ల లాభాలు మాత్రమే కాదు.. భూమ్మీదకు కర్బన ఉద్గారాలు విడుదలై వినాశం వైపు అడుగులు కూడా వేస్తోంది. అందుకే ఇంటర్నెట్ యూసేజ్‌ను తగ్గించాలని, పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు.
►ఇంటర్నెట్‌లో డాటాను లెక్కించడం కష్టమే!. ఒక అంచనా ప్రకారం మాత్రం.. ఒకరోజులో 1.145 ట్రిలియన్ ఎంబీ క్రియేట్ అవుతోంది