MEMOs TO DDOs: AP ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు

 ఏపీ ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు


అమరావతి: పీఆర్సీ జోవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉద్ధృతం చేసినప్పటికీ, ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్‌ చేయాలని ట్రెజరీ ఉద్యోగులను మరోసారి ఆదేశించింది. ఈ మేరకు వారికి మెమోలు జారీ చేసింది. బిల్లులు ప్రాసెస్‌ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించే సహించేది లేదని స్పష్టం చేసింది. 

READ

ఫిబ్రవరి నెలలోSBI శాలరీ అకౌంట్ ఉన్నవారు ఒక లక్ష వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇంటి నుంచే పొందొచ్చు 

SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత విభాగాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల చెల్లింపు ఏర్పాట్లు చేయాల్సిందిగా మరోసారి అధికారులను ఆదేశించింది. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం జారీ చేసిన హెచ్‌ఆర్‌ఏలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు 16 శాతానికి పెంచుతూ ఆదేశాలిచ్చింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పని చేసేవారికీ 16 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Flash...   AIIMS: ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీ.. డిసెంబర్19 దరఖాస్తులకు చివరి తేదీ