Night Curfew In AP: ఏపీ నైట్‌ కర్ఫ్యూ అమలులో మార్పు, మళ్లీ ఎప్పటి నుంచి అంటే?

 Night Curfew In AP: ఏపీ నైట్‌ కర్ఫ్యూ అమలులో మార్పు, మళ్లీ ఎప్పటి నుంచి అంటే?

సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం మార్పు చేసింది. సంక్రాంతి తర్వాత నైట్‌ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో​ ప్రభుత్వం సవరణ చేసింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

థర్డ్‌ వేవ్‌ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు

Flash...   Honda CB350: కొత్త రెట్రో క్లాసిక్ CB350 బైక్‌.. అదిరిపోయే లుక్, అంతకుమించిన ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?