Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు!
భువనేశ్వర్: ఓ వైపు కరోనా భీభత్సం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి వెరసి విద్యాసంస్థలు తెరవాలనే నిర్ణయానికి గండి పండింది. ఒడిశా రాష్ట్రంలో ప్రాధమిక పాఠశాలలను తెరవాలనే నిర్ణయం మరోమారు వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 1 నుంచి 5 తరగతులకు చెందిన పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ఒడిసా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా అధికారులు వివిధ పాఠశాలలను సందర్శించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఎస్‌ఆర్ దాష్ తెలిపారు. ఐతే 6 నుంచి 10 తరగతుల పిల్లలు మాత్రం యథాతథంగా ఫిజికల్ క్లాసులకు హాజరుకావాలని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్‌కు కట్టుబడి షెడ్యూల్ ప్రకారం ఆఫ్‌లైన్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఆరోగ్య శాఖ బులెటన్ ప్రకారం గడచిన రెండు నెలల్లో కన్నా నిన్న ఒక్క రోజే 424 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ఆదివారం తెల్పింది. కొత్తగా కరోనా సోకిన పేషంట్లలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు దాదాపు 67 మంది ఉన్నట్లు బులెటన్ తెల్పుతోంది.