PRC జీవోను వెనక్కు తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి

 పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి

పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సీఎంవోతో అధికారులు చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏను తగ్గించడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు. పీఆర్సీ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏలను భారీగా తగ్గించడంపై సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి. పీఆర్సీ జీవోలన్ని ఉద్యోగులకు నష్టం కలిగించేలా ఉన్నాయని బండి వెంకట్రామిరెడ్డి అన్నారు.

వాటన్నింటిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కొన్ని అంశాల్లో రాజీపడటానికి సిద్దమేనని వెంకట్రామిరెడ్డి తెలిపారు. కానీ అన్ని అంశాల్లో రాజీపడితే రేపటి రోజున చరిత్ర మముల్ని క్షమించదని బండి వెంకట్రామిరెడ్డి తెలిపారు. రేపు లేదా ఎల్లుండి నుంచి నిరసనలకు సిద్ధం కానున్నట్టు ఆయన తెలిపారు. ఉమ్మడి కార్యచరణతో భవిష్యత్‌ కార్యచరణను రూపొందిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు.

Flash...   Google Search introduces feature that will teach you a new English word every day