PRC బ్రేకింగ్‌: ఉద్యోగ సంఘాలకు మళ్లీ పిలుపు.. ఇవాళే LPRC ప్రకటన..!

 బ్రేకింగ్‌: ఉద్యోగ సంఘాలకు మళ్లీ పిలుపు.. ఇవాళే PRC ప్రకటన..!

పీఆర్సీపై ఇవాళే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.. గురువారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సీఎం వైఎస్‌ జగన్… ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నానని.. అన్నింటినీ స్ట్రీమ్‌ లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.. ఇదే సమయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు ఏపీ సీఎం… రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. అయితే, పరిస్థితి చూస్తుంటే ఇవాళే ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది..

ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయంలో పీఆర్సీ అంశంపై అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఆర్ధిక శాఖ అధికారులు హాజరయ్యారు.. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తానని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో పీఆర్సీపై ఫోకస్ చేసి చర్చించారు.. ఇక, ఈ సమావేశం ముగియగానే.. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు వెళ్లింది.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు సీఎం జగన్.. ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నుంచి ఉద్యోగ సంఘాలకు సమాచారం వెళ్లింది.. గత మూడు రోజులుగా పీఆర్సీ పై దఫదఫాలుగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఇవాళ ఉదయం కూడా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్, అధికారులతో సమగ్రంగా చర్చించారు.. ఇక, ఉద్యోగ సంఘాల భేటీలోనే ఫిట్‌మెంట్ అంకె చెప్పనున్నారు సీఎం జగన్.. అనంతరం ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.. మొత్తంగా సంక్రాంతి కానుకగా పీఆర్సీ ప్రకటించనుంది ఏపీ సర్కార్.

Flash...   STMS NEW VERSION APP 2.5.6