PRC పై నేడే సీఎం జగన్ నిర్ణయం…ఫిట్ మెంట్ ఎంత..!!

 పీఆర్సీపై నేడే సీఎం జగన్ నిర్ణయం- ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం : ఫిట్ మెంట్ ఎంత..!!


ఏపీ ఉద్యోగులు .. పెన్షనర్లు ఎన్నో ఆశలతో సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న పీఆర్సీ పైన ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల కీలక భేటీ జరగనుంది. కొంత కాలంగా పీఆర్సీ పైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులు పలు మార్లు పీఆర్సీ పైన చర్చించారు. అయితే, పీఆర్సీ పైన నియమించిన అశుతోష్ మిశ్ర కమిటీ ఇచ్చిన నివేదిక పైన సీఎస్ తో సహా అధికారుల కమిటీ అధ్యయన రిపోర్టును సీఎంకు నివేదించారు

Read: కొత్త డీఏ తో మీ శాలరీ ఏంటో తెలుసుకోండి 

ఉద్యోగ సంఘాలతో చర్చలు

 అందులో అధికారులు చేసిన సిఫార్సుల పైన ఉద్యోగ సంఘాల నేతలు విభేదించారు. తాము ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలతో ఆర్దిక మంత్రి బుగ్గనతో సహా ప్రభుత్వ సలహాదారు సజ్జల.. సీఎస్ సమీర్ శర్మ..తో పాటుగా ఆర్దిక శాఖ అధికారులు పలు మార్లు సమావేశమయ్యారు. ఏపీలో ఆర్దిక పరిస్థితి గురించి సంఘాల నేతలకు వివరించారు. అయితే, అసలు పీఆర్సీ పైన కాకుండా.. రాష్ట్ర అర్దిక పరిస్థితినే తమకు వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేయటం.. ఏ అంశం పైన క్లారిటీ ఇవ్వకపోవటం..ఇచ్చిన హామీలను అమలు చేయక పోవటం పైన ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరసనలకు దిగారు.

Read: రాబోవు PRC లో మీ బేసిక్ పే ఎంతో తెలుసుకోండి

సీఎం వద్ద నేడు తేలిపోనుందా 

అయితే, ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్న సమయంలో… ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన మేరకు తాత్కాలికంగా నిరసన వాయిదా వేసారు. ఇక, తాజాగా జరిగిన సమావేశంలో సీఎంతో చర్చలు చేస్తేనే పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నెల 9వ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకుంటే, 9వ తేదీన సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో..సీఎం జగన్ బుధవారం సీఎస్ తో పాటుగా ఆర్దిక శాఖ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. 14.29శాతంపై ఎంత శాతం పెంచితే ఎంత భారం అదనంగా పడుతుందనే అంశంపై సీఎంకు ఆర్థికశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఇప్పటికే 27 శాతం ఐఆర్ అమలు చేస్తున్న పరిస్థితుల్లో అంత కంటే ఎక్కువగానే పీఆర్సీ ఫిట్ మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Flash...   TELANGANA: POLYCET-2022 NOTIFICATION 2022-23

Read: పదవ తరగతి అన్ని సబ్జెక్టు ల నోట్స్ లు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి 

ఫిట్ మెంట్ పై సీఎం నిర్ణయం ఏంటి 

కానీ, ఒక్కో శాతం పెంపుకు ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందనే అంశం పైన సీఎం ఆరా తీసారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించటంతో అంత కంటే ఎక్కువగా జగన్ ఇస్తారంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావంతో ఉన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏల గురించి ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ మధ్నాహ్నం ఉద్యోగ సంఘాల నేతలను సీఎం క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా సమాచారం ఇచ్చారు. అంతకు ముందు మరోసారి సీఎస్ తో పాటుగా ఆర్దిక శాఖ అధికారులతో సీఎం సమావేశం ఏర్పాటు చేసారు. ఆ తరువాత ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సీఎం నేరుగా సమావేశం కానున్నారు

KSS PRASAD INCOMETAX SOFTWARE కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రోజునే ప్రకటన ఉంటుందంటూ 

వారి నుంచి ఫిట్ మెంట్ పైన అభిప్రాయం సేకరించి.. సీఎం తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా సీపీఎస్ తో పాటుగా రూ 1600 కోట్ల మేర ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్న బకాయిల పైన సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో… ఈ రోజు ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం అవ్వటం ద్వారా..పీఆర్సీ పైన ప్రకటన ఉంటుందని… 30 శాతానికి పైగానే ఫిట్ మెంట్ ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు..పెన్షనర్లు ఈ సమావేశం…సీఎం నిర్ణయం పైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.