PRC : ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగ సంఘాలు.. స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

 ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగ సంఘాలు.. స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు. 

అమరావతి: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల సాధన సమితి ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ సమావేశం జరుగుతున్న సమయంలో జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి శశిబుసన్ కుమార్ నుండి ఫోన్  వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రులతో 2వ బ్లాక్‌లోని ఫైనాన్స్ సమావేశ మందిరంలో చర్చలకు  రావాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ జీవోలు వెనెక్కి తీసుకునేవరకు చర్చలకు వచ్చేది లేదని  స్టీరింగ్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. 

READ: అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మె బాటలోనే ..

స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసన తర్వాత ఉద్యోగుల సంఘంల నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి  చేస్తోందన్నారు. తమ పాత జీతాలు ఈ నెలలోనే ఇవ్వాలని ఇప్పటికే లేఖ ఇచ్చామని చెప్పారు.  ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోందని,  అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘సీఎస్ సమీర్ శర్మకు రేపు సమ్మెనోటీస్ ఇస్తాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇవ్వాలని నిర్ణయించాం. స్టీరింగ్ కమిటీ‎తో పాటు అన్ని సంఘాల నాయకులలో వ్యతిరేకత ఉంది. పాతజీతాలనే ఇవ్వాలని ఇప్పటికే సీఎస్‎కు చెప్పాం. స్టీరింగ్ కమిటీలో మరో 8 మంది సభ్యులను చేర్చాలని నిర్ణయించాం. మొత్తం 20 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాం.’’ అని బండి శ్రీనివాసరావు అన్నారు. 

READ: ఫిబ్రవరిలో ఉద్యోగులకు జీతాల్లేవా..?

ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ మాట్లాడుతూ ‘‘జీఏడీ హెచ్‎ఆర్  కార్యదర్శి శశిబుసన్ కుమార్ మంత్రులు ఉంటారు చర్చలకు రావాలని పిలిచారు. పీఆర్సీ జీవోలు వెనెక్కి తీసుకోవడం, పాత జీతం ఇవ్వాలని కోరాం. అప్పుడే చర్చల విషయం ఆలోచిస్తామన్నాం. చీఫ్ సెక్రటరీపై మేము ఎలాంటి ఆరోపణలు చేయలేదు. అయితే ఆయన ఉద్యోగ  సమస్యలు అడ్రెస్ చేయడంలో విఫలం అయ్యార నేది అన్నిసంఘాల అభిప్రాయం. ఇదే మాటకు కట్టుబడి ఉన్నాం.’’ అని అన్నారు. 

Flash...   Everyday Egg: ప్రతిరోజూ గుడ్లు తింటే ఏమవుతుంది? మీ ప్రశ్నకు సమాధానం చెబుతున్న డాక్టర్..!

బొప్పరాజు మాట్లాడుతూ ‘ఉద్యోగులపై వైసీపీ క్యాడర్‎ను ఉసిగొల్పుతూ ఒక ప్రతిని పంపారు. అది సోషల్ మీడియాలో తిరుగుతోంది, ఆందోళన చేస్తున్న వారిపై వైసీపీ క్యాడర్‎తో కేసులు పెట్టిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా మాకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయిస్తున్నారు. వాలంటీర్‎లు పార్టీ ద్వారా ఎన్నుకోబడ్డవారే.’ అని అన్నారు.