PRC | ఏపీలో నేడుకూడా పనిచేయనున్న ట్రెజరీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ట్రెజరీ కార్యాలయాలు నేడు కూడా పనిచేయనున్నాయి. కొత్త పీఆర్సీ నేపథ్యంలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశాల్లో సూచించింది. ఈ మేరకు ఏపీలోని కార్యాలయాలన్నిటికీ వాట్సప్ మెసేజ్‌లు వెళ్లాయి. ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులనూ క్లియర్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
మరోవైపు ప్రభుత్వ ఉద్యుగులకు జీతాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రివైజ్డ్ పే స్కేల్ చెల్లింపులకు మార్చి 31 వరకు గడువు ఇచ్చినట్లు ఈ నెల 19న జారీ చేసిన మెమోలో ప్రభుత్వం వెల్లడించింది. అంతలోనే జనవరి నెల జీతాలను కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేయాలంటూ ట్రెజరీ ఉద్యోగులకు స్పష్టం చేసింది. సమయం ఉన్నప్పటికీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ మెమో జారీ చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
READ:
ఫిబ్రవరి నెలలోSBI శాలరీ అకౌంట్ ఉన్నవారు ఒక లక్ష వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇంటి నుంచే పొందొచ్చు