PRC EFFECT: అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మె బాటలోనే .. సమ్మె సైరన్ మోగింది

 సమ్మెలో మేమూ పాల్గొంటాం ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం

విజయవాడ, న్యూస్‌టుడే: ఉద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వ ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా తాము కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కారరావు ప్రకటించారు. ‘‘కార్మిక చట్టాల ప్రకారం ప్రత్యేకంగా సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందజేస్తాం. అవసరమైతే వైద్య సేవలను సైతం నిలిపివేయడానికి వెనకాడబోం. సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో నిర్లిప్తత ప్రదర్శించడం సరికాదు. తక్షణమే 30% తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ప్రకటించాలి.  హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను యథాతథంగా అమలు చేయటంతోపాటు ఒప్పంద ఉద్యోగులను రెగ్యులైజ్‌ చేయాలి’ అని స్పష్టంచేశారు.

ఉద్యమంలో పాల్గొంటాం: వీఆర్వోల సంఘం

Jan 22  2022 

 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ సాధన సమితి ఉద్యమ కార్యాచరణలో గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొంటారని ఏపీ వీఆర్వోల సంఘం ప్రకటించింది. సంఘం రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, ఎం.అప్పలనాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ, కారుణ్య నియామకాలలో వీఆర్వోలతో పాటు ఇప్పుడు ప్రతి శాఖలోని ఉద్యోగికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు గ్రామ సచివాలయాలలో ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఖండించారు. వారి అర్హతలను బట్టి గతంలో మాదిరిగా కారుణ్య నియామకాలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లే పరిస్థితి కల్పించకుండా తక్షణం సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు

రేపటి నుంచి ఏపీ హైకోర్టు ఉద్యోగుల నిరసన

Jan 23 2022 @ 03:02AM

పీఆర్సీకి నిరసగా ఈ నెల 24 నుంచి నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరు కావాలని హైకోర్టు ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న జరిగిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి నిరసన హైకోర్టు చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదని పేర్కొంది. రిజిస్ట్రార్‌ జనరల్‌ ద్వారా ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినట్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Flash...   PRC NEWS | ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోం : బొత్స

పీఆర్‌సీ పోరులోకి ‘ఆర్టీసీ’

♦అందరిబాటలోనే సమ్మెకు సై.. 7 నుంచి బస్సులకు బ్రేక్‌?

🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి) ఉద్యోగులకు రివర్స్‌ పీఆర్‌సీ ఇచ్చిన జగన్‌ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజా రవాణా సంస్థ(పీటీడీ) సిబ్బంది కూడా సిద్ధమయ్యారు. అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వెనుకాడబోం అంటున్నారు. ఎన్‌జీవోలతో కలిసి సమరానికై సై అంటున్నారు.  పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు ఆదివారం(23న) రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు మొదలుకొని ఫిబ్రవరి 7న సమ్మె(బస్సులు ఆపేయడం) వరకూ పోరాటంలో కలిసి వస్తామని చెబుతున్నారు. ఏపీఎ్‌సఆర్టీసీలోని బలమైన అసోసియేషన్లలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఇప్పటికే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటుండగా, ఎన్‌ఎంయూ శనివారం ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కూడా ఎన్‌జీవోల పోరాటానికి మద్దతు తెలిపింది. 

దీంతో ఫిబ్రవరి 7 నుంచి  బస్సులు ఆగిపోతే ఏం చేయాలన్న ఆందోళన ఆర్టీసీ ఉన్నతాధికారుల్లో మొదలైంది. రెండేళ్ల క్రితం వరకూ ఆర్టీసీ(కార్పొరేషన్‌) సిబ్బందిగా ఉంటూ 2020 జనవరిలో ప్రభుత్వంలో విలీనమై పీటీడీ ఉద్యోగులుగా మారిన యాభై వేల మంది ఉమ్మడి పోరులో భాగస్వాములయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం అన్ని జిల్లాల్లో నిర్వహించనున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు పీటీడీ ఉద్యోగ సంఘాల నేతులు కూడా హాజరుకానున్నారు. పాత పెన్షన్‌ అమలు చేసి ప్రస్తుత వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు పీవీ రమణా రెడ్డి, వై.శ్రీనివాసరావు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వ విలీనమైన తమకు ప్రస్తుతమున్న ఇంటి అద్దె శ్లాబులే(12ు నుంచి 30ు) కొనసాగించాలని కోరారు. ఈ రెండింటితో పాటు విలీనం నాటికి ప్రభుత్వ ఉద్యోగులతో వెనుక బడి ఉన్న 19శాతం భర్తీ చేయాలని కోరారు. మరో పెద్ద యూనియన్‌ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.రావు ఇప్పటికే బొప్పరాజు జేఏసీతో కలిసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు, అలవెన్స్‌ల విషయంలో తాము రాజీపడే ప్రసక్తేలేదని ఈయూ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, ఉద్యోగుల ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. 

Flash...   AP EAPCET (EAMCET) SHCEDULE 2022 RELEASED