PRC NEWS: ఇప్పుడు క‌మిటీయా..? అంతా రివ‌ర్స్ వ్య‌వ‌హారం.!

 ఇప్పుడు క‌మిటీయా..? అంతా రివ‌ర్స్ వ్య‌వ‌హారం.!

పీఆర్సీపై ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మ‌రోసారి ఉద్య‌మానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ స‌మావేశ‌మైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వ‌నున్నారు.. ఇవాళ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోర‌నున్నారు.. అయితే, ఉద్యోగుల‌తో సంప్ర‌దింపుల కోసం తాజాగా ఏపీ స‌ర్కార్ మంత్రుల క‌మిటీని వేసింది.. మంత్రులు బుగ్గ‌న, పేర్నినాని, బొత్స‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌, సీఎస్‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం క‌మిటీ వేయ‌డంపై మండిప‌డుతున్నాయి ఉద్యోగ సంఘాలు..

ప్రభుత్వం సంప్రదింపుల కోసం కమిటీ ఏ ఉద్దేశ్యంతో వేసిందో మాకు తెలియ‌ద‌న్న ఏపీ ఉద్యోగ సంఘాల‌ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్… సహజంగా పీఆర్సీ ప్రకటనకు ముందు మంత్రుల కమిటీ వేస్తారు… కానీ, ఈ ప్రభుత్వానిదంతా రివర్స్ వ్యవహారంగా ఉంది అని ఎద్దేవా చేశారు… పీఆర్సీని ప్రకటించి మంత్రుల కమిటీని వేశారు.. కానీ, మంత్రుల కమిటీ వేయడం ద్వారా ప్రభుత్వం మెత్తబడినట్టుగా మేం భావించలేం అన్నారు.. గతంలోనూ ఇదే విధంగా మెత్తబడినట్టు కన్పించి.. పీఆర్సీ జీవోలు జారీ చేశారిన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఇక‌, స‌చివాయంలో జరిపే సమావేశంలో ప్రభుత్వం వేసిన కమిటీ మీద కూడా చ‌ర్చిస్తామ‌ని తెలిపారు బండి శ్రీ‌నివాస్‌.

Flash...   ఉపాధ్యాయులకు ఆదాయపు పన్ను మినహాయించాలి