PRC NEWS | ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోం : బొత్స

 ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోం : బొత్స సత్యనారాయణ


ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే ఉద్యోగులు చర్చలకు వస్తామని చెబుతున్నారన్నారు. జీవోలు విడుదల అయినందున ప్రభుత్వం కొత్త జీతాలను ఇస్తుందన్నారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి పై తూలనాడి మాట్లాడితే సంఘం నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మేము కూడా మాట్లాడితే మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

READ

ఫిబ్రవరి నెలలోSBI శాలరీ అకౌంట్ ఉన్నవారు ఒక లక్ష వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇంటి నుంచే పొందొచ్చు 

SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

అది మేము కోరుకోవడం లేదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే పర్యవసానాలు చూడాల్సి వస్తుందని మంత్రి ఉద్యోగులను హెచ్చరించారు. మొదటి తేదీ నుంచి ఎంత మందికి వీలైతే అంతమందికి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పాత జీతాలు కావాలంటారు… మొదటి తేదీన జీతాలు వేసే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అంటున్నారు.ఇది ద్వంద్వ వైఖరి కాదా అంటూ ఉద్యోగులను మంత్రి ప్రశ్నించారు. జీతాలు ప్రాసెస్ చేయని సిబ్బంది, అధికారుల పై ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇవన్నీ క్రమ శిక్షణా చర్యల్లో భాగమే.. టీడీపీకి టైం బాలేదు. దీక్షలు వాళ్లే చేస్తున్నారు. వాళ్ల నాయకులే అత్యాచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

Flash...   బడిలో బయోమెట్రిక్ హాజరు