PRC NEWS: ఉద్యోగుల ఉద్యమంలో కీల‌క మ‌లుపు

 ఉద్యోగుల ఉద్యమంలో కీల‌క మ‌లుపు

అమ‌రావ‌తి: ఉద్యోగుల ఉద్యమం కీల‌క మ‌లుపు తిరుగుతోంది. స‌చివాల‌యంలో ఉద్యోగ‌ సంఘాలు భేటీ అయ్యారు. పీఆర్సీ అనుబంధ సమ‌స్యల‌పై క‌లిసి ప‌నిచేద్దామని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ పిలుపునిచ్చారు. సూర్యనారాయ‌ణ ప్రతిపాద‌న‌కు సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంక‌ట్రామిరెడ్డి ఓకే చెప్పారు. ఇప్పటికే అన్ని సంఘాలు ఏక‌తాటిపైకి రావాల‌ని కోరామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇద్దరం కలిసి జేఏసీ నేత‌లు బొప్పరాజు, శ్రీనివాస‌రావుల‌ను క‌లుస్తామని, పీఆర్సీ సాధ‌న స‌మితి పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని సూర్యనారాయణ, వెంక‌ట్రామిరెడ్డి సంయుక్తంగా ప్రకటించారు. 

‘‘ఉద్యోగుల వేతనంలో ప్రభుత్వం అంకెల గారడి చేసింది. ఉద్యోగులంతా ఒకే కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తున్నాం. ఇందులో భేషజాలకు తావులేదు. కలిసి పని చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘాన్ని కోరాం. దానికి వెంకట్రామిరెడ్డి అంగీకారం తెలిపారు. ఎన్జీవోలు, రెవెన్యూ సంఘాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. రేపటిలోగా ఉద్యోగసంఘాల ఐక్య వేదిక ప్రకటించే ఛాన్స్‌ ఉంది’’ అని సూర్యనారాయణ తెలిపారు.

‘‘ఉద్యోగుల ఆకాంక్షల ప్రకారం అంతా కలిసి పోరాడుతాం. పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకునేవరకు పోరాటం ఆగదు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒకే వేదిక ఏర్పాటుకు వచ్చింది. సచివాలయ ఉద్యోగుల సంఘంగా మేం కూడా ముందడుగు వేస్తాం. ఇతర సంఘాలు కూడా సంప్రదింపులు చేస్తున్నాయి’’ అని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Flash...   AP EAPCET (EAMCET) SHCEDULE 2022 RELEASED