PRC NEWS: మాటల్లేవ్.. ఇక ఉద్యమమే శరణ్యమా?

 AP PRC : మాటల్లేవ్.. ఇక ఉద్యమమే శరణ్యమా?


AP లో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికే ఊ అంటున్నాయా? మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాయా? అంటే అవుననే అనిపిస్తోంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరి ఉద్యోగ సంఘాలకు మంట పుట్టిస్తోంది. దీంతో తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశాయి ఉద్యోగ సంఘాలు. జనవరి 9 నుంచి ఆందోళన బాట చేపట్టాలని భావిస్తున్నాయి.

PRC  నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చారని, సీఎస్ నివేదిక ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాస రావు. ఇక చర్చలు ముఖ్యమంత్రి తోనే తప్ప అధికారులతో అయ్యే పని కాదని తేలిపోయిందన్నారు. ఈ నెల 9న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాక అదే రోజు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం అన్నారు.

ALSO READ:

కొత్త పీఆర్సీ లో మీ బేసిక్ పే ఎంతో తెలుసుకోండి 

కొత్త డీఏ తో మీ జీతం ఎంతో తెలుసుకోండి 

INCOMETAX SOFTWARES డౌన్లోడ్ చేసుకోండి 

సంక్రాంతి పండుగ సమయంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టమని చాలా మంది అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఆర్ధిక మంత్రి, సీఎస్ మాకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ప్రభుత్వంతో ఘర్షణను మేము కోరుకోవటం లేదు. కానీ ప్రభుత్వమే మా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని ఆందోళన బాటలో నెట్టేసిన పాపం ప్రభుత్వానిదే అన్నారు.

మావి గొంతెమ్మ కోరికలు కావు.. బొప్పరాజు

తమతో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించారని, కింద స్థాయి ఉద్యోగులను అవమానించే రీతిలో చర్చలు జరిగాయన్నారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. మేము దాచుకున్న డబ్బులు 1600 కోట్లు 2వేల కోట్లు అయ్యాయి. ఈ బిల్లులు మార్చి లోగా చెల్లిస్తామనటం ఒక కుట్ర. మా కూలీ డబ్బులనే మేము అడుగుతున్నాం. నాలుగు డీఏలు రావాల్సి ఉందన్నారు బొప్పరాజు. సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి కూడా ఇప్పుడు నోరు విప్పటం లేదు. సీపీఎస్ ఉద్యోగుల వేల కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయో తెలియదు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదన్నారు బొప్పరాజు. అధికారులు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం మాకు ఉంది.

Flash...   PRC NEWS: నాన్చుడు లేదు.. తేల్చుడే : ఎంప్లాయిస్ కు రేపే గుడ్ న్యూస్..!!