PRC NEWS: ఉద్యోగులతో చర్చలకు మేం సిద్దం : సజ్జల

 ఉద్యోగులతో చర్చలకు మేం సిద్దం : సజ్జల


ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్దంగా ఉన్నామని, అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్దమన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని, పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామని, పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమేనని ఆయన వెల్లడించారు. చర్చలకు కూర్చొకుండా షరతులు పెట్టడం సమంజసం కాదని, ఈ విధంగా వ్యవహరించడం సరి కాదు.

బాధ్యత కలిగిన నేతలు ఇమ్మెచ్యూర్ గా వ్యవహరించడం మంచిది కాదు. ఉద్యోగులు మా ప్రత్యర్థులో.. శత్రువులో కాదు.. ప్రభుత్వంలో భాగమే. అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడమై ఆయన తెలిపారు. పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో.. ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందని, సీఎం జగన్ పాజిటీవ్ గా ఉండే వ్యక్తే. చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలి. ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదని ఆయన అన్నారు

Flash...   RPS 2022 - Instructions for clearance of Suspense account of Jan 2022 and Feb 2022 salaries