PRC UPDATE : ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం

ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం

AP govt invited employees unions : కొత్త PRC రద్దు చేసే వరకూ తగ్గేది లేదంటున్న ఉద్యోగసంఘాలు… ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ఇప్పటికే ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నట్టు ప్రకటించాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పీఆర్సీపై ధర్నాలు, ర్యాలీలు చేపట్టనున్నారు. ఉద్యోగుల సమ్మెకు ప్రజారోగ్య సంఘం మద్దతు తెలిపింది.

పీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో… 35 ఏళ్ల తర్వాత సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని స్టీరింగ్ కమిటీని జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ ఆహ్వానించారు. అయితే మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లాలా? వద్దా అనే దానిపై కాసేపట్లో స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది.

మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లడంపై సమాలోచనలు జరపనుంది. మంత్రుల కమిటీ వద్దకు వెళ్లి జీవోలపై రివ్యూ చేయాలని స్టీరింగ్ కమిటీ కోరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ దాని అనుబంధ అంశాల మీద అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని ప్రధానంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఫిట్‌మెంటట్‌, హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులు అమలు చేయాలని కోరుతున్నారు. గతంలో సీఎం వైఎస్.జగన్‌ హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. మరోవైపు… ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఇప్పటివరకు ప్రభుత్వం 12 సార్లు చర్చలు జరిగాయి.

Flash...   TLM HAND BOOK FOR CLASSES 3,4 AND 5