PRC సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

 PRC సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు


అమరావతి: కొత్త పీఆర్సీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పిటిషన్ విచారించే రోస్టర్‌లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో.. నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పీఆర్సీ సవాలు పిటిషన్ సీజేకు పంపుతున్నామని న్యాయమూర్తి అన్నారు. ఏపీలో ఉన్న అందరి ప్రయోజనాలు పిటిషన్‌లో ముడిపడి ఉన్నాయన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా విచారణకు స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరు కాలేదు.

పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. నోటీస్ లేకుండా జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమన్నారు. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసింది. స్టీరింగ్ కమిటీలోని 12 మంది సభ్యులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తిరిగి ప్రారంభమైన తర్వాత న్యాయస్థానం ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చింది.

Flash...   రద్దైన పదో తరగతి పరీక్షలపై TS కీలక నిర్ణయం