Reliance Jio 5G: జెట్‌ స్పీడ్‌లో రిలయన్స్‌ జియో 5జీ.. స్పీడ్‌ ఎంతంటే..?

 Reliance Jio 5G: జెట్‌ స్పీడ్‌లో రిలయన్స్‌ జియో 5జీ..రెండు గంటల సినిమా ఒక నిమిషంలోనే..! స్పీడ్‌ ఎంతంటే..?

భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో 5జీ నెట్‌వర్క్‌ కవరేజ్‌ను మరింత వేగంగా విస్తరించేందుకు ప్రణాళిలను రచిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1000కిపైగా నగరాల్లో 5జీ సేవలను అందించేందుకు జియో సిద్దమైంది. కాగా తాజాగా  నిర్వహించిన 5జీ టెస్టింగ్‌లో రిలయన్స్‌ జియో రికార్డు వేగాన్ని సాధించింది. 

రెండు గంటల సినిమా ఒక నిమిషంలోనే..!

91మొబైల్స్ ప్రకారం…రిలయన్స్ జియో 5G నెట్‌వర్క్ , 4G నెట్‌వర్క్‌తో పోల్చితే ఎనిమిది రెట్లు వేగంగా డౌన్‌లోడ్ స్పీడ్, 15 రెట్లు వేగవంతమైన అప్‌లోడ్ స్పీడ్‌ను అందిస్తుంది. జియో 5జీ నెట్‌వర్క్‌ 420Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌, 412 Mbps అప్‌లోడ్ స్పీడ్‌ సాధించినట్లు 91మొబైల్స్‌ వెల్లడించింది. ఈ స్పీడ్‌తో రెండు గంటల నిడివి గల సినిమాను ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో డౌన్‌లోడ్ చేయవచ్చును. ఈ 5జీ టెస్ట్‌ను ముంబైలో పరిక్షించారు. దాంతో పాటుగా జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 46.82Mbpsగా, అప్‌లోడ్ స్పీడ్ 25.31Mbpsగా నమోదైంది. 5G నెట్‌వర్క్‌తో యూజర్లు వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆస్వాదించే అవకాశం ఉంది. 

తొలుత 13 నగరాల్లో..!

దేశవ్యాప్తంగా 13 నగరాల్లో మొదట 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా 1,000 టాప్‌ సిటీలకు 5G కవరేజ్‌ను రిలయన్స్‌ జియో  ప్లానింగ్ చేస్తోంది. 5జీ టెక్నాలజీతో హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో అధునాతన సదుపాయాలను ఉపయోగించి జియో ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. త్రీడీ మ్యాప్స్‌, రే ట్రేసింగ్‌ టెక్నాలజీ ద్వారా 5జీ సేవల సామర్థ్యాన్ని పరీక్షించనుంది.

Flash...   Orientation programme on PRASHAST App