SBI Loans: Online లో సుల‌భంగా SBI ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్‌ లోన్స్‌

 SBI Loans: ఆన్‌లైన్‌లో సుల‌భంగా ఎస్‌బీఐ ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్‌ లోన్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌ముఖ ప్ర‌భుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌మ‌ ఖాతాదారుల‌కు ప‌లు ర‌కాల రుణాల‌ను అందిస్తుంది. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం అత్య‌వ‌స‌రంగా న‌గ‌దు కావాల్సిన బ్యాంకు ఖాతాదారులు ముందుగా ఆమోదించిన వ్య‌క్తిగ‌త రుణాన్ని (ప్రీ-అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్ లోన్‌) ప్ర‌త్యేక రాయితీలతో వేగంగా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా పొందొచ్చు. ఈ సౌక‌ర్యం బ్యాంకు వినియోగ‌దారుల‌కు అన్ని రోజులూ, 24 గంట‌లూ అందుబాటులో ఉంటుంది.

చదవండి : SBI 3 in 1 offer: SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!

ఫీచ‌ర్లు..

* క‌నిష్ఠంగా వ‌డ్డీరేటు 9.60 శాతం నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

* జ‌న‌వ‌రి 31, 2022 వ‌ర‌కు ప్రాసెసింగ్ ఛార్జీల్లో 100శాతం మిన‌హాయింపు ఉంది.

* కేవ‌లం నాలుగు క్లిక్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. త‌క్ష‌ణ‌మే రుణం మంజూరు చేస్తారు.

* భౌతికంగా ప‌త్రాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు.

* బ్రాంచ్‌కి వెళ్లాల్సిన ప‌ని లేదు.

* యోనో యాప్‌లో వారంలో ఏడు రోజులు, రోజులో 24 గంట‌లూ రుణ సౌక‌ర్యం అందుబాటులో ఉంటుంది. 

చదవండి :  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు

యోనో యాప్ ద్వారా రుణం పొందేందుకు అనుస‌రించాల్సిన 4 ద‌శ‌లు..

1. ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వండి.

2. డ్రాప్‌-డౌన్ మోనూలోని “అవైల్ నౌ” బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.

3. లోన్ మొత్తం, కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోండి.

4. బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసిన మొబైల్‌ నంబర్‌కి వచ్చిన‌ ఓటీపీని ఎంట‌ర్ చేస్తే ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు. రుణ‌ మొత్తం ఖాతాకు క్రెడిట్ అవుతుంది. కేవ‌లం 4 క్లిక్కుల్లో వ్యక్తిగ‌త రుణానికి సంబంధించి త‌క్ష‌ణ ప్రాసెసింగ్ జ‌రుగుతుంది.

రుణ అర్హ‌త‌ను చెక్ చేసుకునే విధానం..

ఎస్‌బీఐ వినియోగ‌దారులు PAPL<స్పేస్‌>< చివ‌రి 4 అంకెల SBI ACCOUNT NUMBER>> టైప్ చేసి 567676 నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ చేసి, వారి రుణ అర్హ‌త‌ను తెలుసుకోవ‌చ్చు.

Flash...   Fake links: బీ కేర్ ఫుల్.. ఆశపడి లింక్ ఓపెన్ చేశారో అంతే సంగతులు,

CLICK HERE FOR PRE APPROVED LOAN