WhatsApp: ఇకపై వాట్సాప్‌ యాప్‌లోనుఫొటో ఎడిట్!

 WhatsApp: ఇకపై వాట్సాప్‌ యాప్‌లోనుఫొటో ఎడిట్!

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్‌ యూజర్లకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇప్పటి వరకు డెస్క్‌టాప్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న డ్రాయింగ్ టూల్‌/ఫొటో ఎడిట్‌ టూల్‌ను త్వరలో మొబైల్ వెర్షన్‌లో కూడా తీసుకొస్తున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. మొబైల్‌ వాట్సాప్‌లో రెండు వెర్షన్లలో ఈ టూల్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒకటి ఫొటోల కోసం కాగా, రెండోది వీడియోలను ఎడిట్‌ చేసేందుకని వాబీటాఇన్ఫో వెల్లడించింది. ఈ టూల్‌తో యూజర్లు తాము ఇతరులకు పంపే ఫొటోలను క్రాప్‌ చేయడంతోపాటు, ఫొటోలపై ఎమోజీలు, జిఫ్‌, టెక్ట్స్‌ను యాడ్‌ చేయొచ్చు. వీడియోలకు ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుందనేది తెలియాల్సివుంది. 


SBI బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు వాడకూడని యాప్స్ ఇవే..!

ఇవేకాకుండా వాట్సాప్‌ డెస్క్‌టాప్ యూజర్ల కోసం యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో మార్పులు చేయడంతోపాటు, చాట్ బబుల్స్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. అలానే చాట్‌ బార్‌ రంగులు కూడా మార్చుకునేందుకు వీలుగా కొత్త అప్‌డేట్‌ను పరిచయం చేయనుంది. వీటితోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ మెసేజ్‌, చాట్‌ లిస్ట్‌లో మార్పులు, అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ వంటి కొత్త పీచర్లను వాట్సాప్ తీసుకురానుంది. మిగతా మెసేజింగ్‌ యాప్‌లతో పోలిస్తే గత కొద్ది నెలలుగా వరుస కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వాట్సాప్ వినియోగాన్ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌గా మార్చే ప్రయత్నం చేస్తోంది.

Flash...   గుమ్మడికాయ గింజలు కనిపిస్తే అస్సలు వదలద్దు..! నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..