WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

 WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

WhatsApp Scam : సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో చీట్ చేస్తున్నారు. సందర్భానికి తగ్గట్టుగా లింకులు పంపి అడ్డంగా దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను వాట్సాప్ యూజర్లపై పడింది. అసలే ఇది పండుగల సీజన్. న్యూఇయర్, సంక్రాంతి సందడి నెలకొంది. సైబర్ క్రిమినల్స్ దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఫెస్టివల్ రివార్డ్స్ పేరుతో లింకులు పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

మ్యాటర్ ఏంటంటే.. సైబర్ నేరగాళ్లు Rediroff.ru పేరుతో వాట్సాప్ యూజర్లను మోసగిస్తున్నారు. న్యూఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ రివార్డ్స్ ప్రకటిస్తూ లింక్స్ పంపుతారు. డబ్బులు వస్తాయనే ఆశతో వాటిని క్లిక్ చేయగానే డమ్మీ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలు అడుగుతుంది. గుడ్డిగా నమ్మి అందులో మన పేరు, వయసు, బ్యాంకు అకౌంట్ వివరాలు సబ్మిట్ చేయగానే మన సమాచారం మొత్తం వాళ్లకు వెళ్తుంది. అంతే, ఖేల్ ఖతమ్.. మన బ్యాంకు ఖాతాలోని డబ్బులు మనకు తెలియకుండానే ఖాళీ చేసేస్తారు. వాస్తవానికి ఇదో రకం స్కామ్ అని సైబర్ నిపుణులు చెప్పారు. మాల్ వేర్ తో కూడిన లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.

చదవండి : మొద‌లైన బాదుడు… ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌కు రూ. 21 స‌ర్వీస్ చార్జ్‌…

అందుకే, వాట్సాప్ యూజర్లు అలర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. Rediroff.ru అనే పేరుతో వచ్చే లింక్ క్లిక్ చేయొద్దని కోరారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రివార్డుల పేరుతో సైబర్ నేరగాళ్లు గాలం వేస్తారని, వాటికి ఆశపడితే అడ్డంగా మోసపోతారని చెప్పారు.

చదవండి : రోజు ఈ టీ తాగితే చాలు..! యవ్వనంగా కనిపిస్తారు

వాట్సాప్ లో అనేక రకాల లింకులు వస్తుంటాయి. అయితే అందులో నిజం ఎంతో తెలుసుకోవాలి. గుడ్డిగా వాటిని క్లిక్ చేయడం లేదా ఇతరులకు ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం వంటివి అస్సలు చేయొద్దని సైబర్ నిపుణులు సూచించారు. మన అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష అని తేల్చి చెప్పారు

Flash...   promotions to the teachers who are identified in excess ratio of 30% under 610