ఈ నెల 30 వరకు విద్యాసంస్థలు బంద్.! రేపు అధికారిక ప్రకటన..!

ఈ నెల 30 వరకు విద్యాసంస్థలు బంద్.! రేపు అధికారిక ప్రకటన..!

Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి చాలాకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. గత ఏడాది కరోనా విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూల్స్‌, కాలేజీలు మూత పడటంతో ఆన్‌లైన్‌ క్లాసులతో సరిపెట్టుకున్నారు విద్యార్థులు. ఇక తాజాగా రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తోంది.

ఇప్పటికే విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన  ప్రభుత్వం.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులను పొడించే ఆలోచనలో ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక తాజాగా మరో వార్త వినిపిస్తోంది. రాష్ట్రంలో 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలను బంద్‌ ఉంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆదివారం విద్యాశాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కాగా, రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో ముందుగా విద్యాసంస్థలను 20 వరకు పొడిగించాలని భావించినా.. అలా కాకుండా ఎక్కువ రోజులు పొడిగిస్తే బాగుంటుందని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎక్కువ రోజులు పొడిగించినట్లయితే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది.

Flash...   Alternative Academic Calendar Weekly work done - Alternative Links