తొలుత ఉపాధ్యాయుల వేతనాలు. . . వారి స్కెళ్ల నిర్ధారణే ముందు


తొలుత ఉపాధ్యాయుల వేతనాలు. 

వారి స్కెళ్ల నిర్ధారణే ముందు

తర్వాతే మిగిలిన ఉద్యోగులకి.

అమరావతి: రాష్ట్ర ఉద్యోగులు, ఉపా ధ్యాయులకు 2022 వేతన సవరణ ప్రకారం స్కేళ్ల నిర్ధారణ, పే ఫిక్సేషన్ వేగంగా చేపట్టాలని ఉన్నతా ధికారులు వెంటపడుతున్నారు. కొత్త పీఆర్సీని ఉపా ధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ఆందో ళనకు సంబంధించిన కార్యాచరణను ప్రకటిం చాయి. ఈ నేపథ్యంలో కొత్త వేతన ఖరారులో తొలుత ఉపాధ్యాయుల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఖజానా అధికారులకు అనధికార వర్త మానం అందింది. ఫిబ్రవరి 27లోపు రాష్ట్రంలోని అందరు ఉపాధ్యాయులు, ఉద్యోగుల కొత్త వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంతవరకు డ్రాయింగ్ డిస్బర్సు మెంట్ అధికారులు రిక్వెస్టు సైటు ఉండేది. అది ఇక పని చేయబోదని, ఇక వేతనాల బిల్లులన్నీ పేరోల్ ప్రోగ్రాంలోనే చేయాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. తొలుత రాష్ట్రంలోని అందరు డ్రాయింగ్ డిసర్సుమెంటు అధికారులు 2022 వేతన సవరణ వివరాలను (డేటా) నిర్ధారించాల్సి ఉంటుంది. తర్వాత ఖజానా  అధికారులు వాటిని ఖరారుచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త పీఆర్సీ ఉత్త ర్వులు (ప్రొసీడింగులు), సిబ్బంది పేర్లు, జీతాల బిల్లులు కనిపిస్తాయి.

TIS: update your information in TIS for Promotion

Payslip DOWNLOAD చేసుకొనుటకు CFMS  మొబైల్ యాప్ 

DSC 1998 నుంచి DSC 2012 వరకు PAY FIXATION FORMS pdf లు

అందరు డ్రాయింగు డిస్బర్సుమెంట్ అధికా రులు ఫిబ్రవరి 18లోగా వివరాలను నమోదు చేయాలి. వాటిని ఖరారుచేసి ఖజానా అధికా రులకు పంపాలి.

ఫిబ్రవరి 21నాటికి ఖజానా అధికారులు, పేఅం డ్ అకౌంట్లు అధికారులు వేతనాలను ఖరారు చేయాలి.

జిల్లా కలెక్టర్లు డీడీవోలను పర్యవేక్షించాలి. రాష్ట్రస్థాయిలో విభాగాధిపతులు ఈ పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షించాలి.

తొలుత సర్వీసు రిజిష్టర్లు పరిశీలించి 1.7.2018 నాటికి మూలవేతనాన్ని నిర్ధారించాలి. తర్వాత ఆయా ఉద్యోగి. ఆర్జన, మినహాయిం పులు నమోదు చేసి డీడీవోలు ఖరారుచేయాలి. అక్కడినుంచి ఖజానా అధికారులకు పంపాలి. వారు ఖరారు చేసి  CFMS కు పంపుతారు. అక్కడ పరిశీలించి మళ్లీ డ్రాయింగు డిస్ బర్సు మెంట్ అధికారులకు పంపుతారు. సరిచూసుకు నాక అక్కడినుంచి ఖజానా అధికారుల ద్వారా CFMS కు చేరుతాయి. అక్కడినుంచి రిజర్వు బ్యాంకుకు పంపిజీతాలు జమ చేస్తారు.

Flash...   BANK LOAN తీసుకున్న వారికి శుభవార్త