30వేల పదోన్నతులు సాధ్యమేనా..! ఉపాధ్యాయుల్లో సందేహాలు

♦ పదోన్నతులు సాధ్యమేనా..!

♦ ఉపాధ్యాయుల్లో సందేహాలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 30వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సంబరపడిన ఉపాధ్యాయులు ఇది ఎంతవరకు కార్యాచరణకు నోచుకుంటుందోనని సందేహపడుతున్నారు. జిల్లాలో వెయ్యి నుంచి 1500 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందే అవకాశముందని ఆశగా ఎదురుచూస్తున్నారు. నూతన విద్యావిధానం అమలులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరంలో మూడు కిలోమీటర్లలోపు గల ప్రాథమిక పాఠశాలకు సంబంధించి 3, 4, 5 తరగతులను విలీనం చేయగా అదనంగా చేరే విద్యార్థులతో నూతనంగా స్కూల్‌ అసిస్టెంÆట్ పోస్టులు మంజూరు చేస్తామని తెలిపారు. 

ప్రకటన వరకు బాగానే ఉన్నప్పటికీ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కేవలం ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన జరుగుతుందని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరంలో కేవలం 9, 10 తరగతులు మాత్రమే రెండు మాధ్యమాలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గల సక్సెస్‌ పాఠశాలల్లో రెండు మాధ్యమాలు కొనసాగుతూ విడివిడిగా ఉపాధ్యాయుల ప్యాట్రన్‌ ఉంది. వేసవిలో ఉన్నత పాఠశాలల్లో హేతుబద్ధీకరణ జరిగితే స్కూల్‌ అసిస్టెంట్ (పాఠశాల సహాయకుడు) పోస్టులు అదనం కానున్నాయని సంఘాలు తెలుపుతున్నాయి. అదనంగా ప్రాథమిక పాఠశాలల నుంచి వచ్చే 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల సహాయకులు సరిపోయే అవకాశముందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ విధంగా అదనంగా పోస్టులు కొత్తగా వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

♦ఉద్యోగ విరమణ ఖాళీలు లేవు

 ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో రాబోయే రెండు సంవత్సరాలలో పదవీ విరమణ పొందేవారు లేరు. దీంతో పదోన్నతులు పొందే వారు తక్కువగా ఉంటారు. అసలే పీˆఆర్సీ ఫిÆట్మ్‌ెంట్‌పై అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయులను శాతపరిచేందుకు మధ్యే మార్గంగా తెలంగాణాలోగా పదివేలు ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులను సృష్టించడం వంటివి చేసి పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్న 12 సంవత్సరాలు నిండిన ఎస్‌జీటీలను పాఠశాల సహాయకులుగా పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Flash...   National level-Rural IT Quiz 2021 to the students by Tata Consultancy Services (TCS)

♦వివరాల నమోదుకు గడువు ముగిసినా..

వేసవిలో జరిగే పదోన్నతులు, బదిలీలకు సంబంధించి టీఐఎస్‌లో వివరాలు నమోదు చేయటానికి ఈనెల 25తో గడువు ముగిసినప్పటికీ ఇంకా నమోదు ప్రక్రియ సాగుతోంది. ఇప్పటివరకు కేవలం 30 నుంచి 40శాతం మేర మాత్రమే నమోదు చేసినట్లు సమాచారం. వ్యక్తిగత సమాచారంతో పాటు చదువు, ఉద్యోగంలో చేరిన, బదిలీల వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంది. గతంలో పూర్తి చేసిన చదువు వివరాలు పూర్తిగా తొలగిపోయాయి.తిరిగి వాటిని నమోదు చేస్తున్నారు. అయితే టీఐఎస్‌లో ఇప్పటికీ అనేకమంది ఫొటోలు  అప్‌లోడ్‌ కావటం లేదని, సాంకేతిక సమస్యలు తొలగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇందులో పొందుపరిచిన సమాచారం ఆధారంగానే పదోన్నతులు, బదిలీలు జరపనుండడంతో ఉపాధ్యాయులు అదే పనిలో ఉన్నారు. పదోన్నతులకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు వస్తేనే ఎంతవరకు ముఖ్యమంత్రి చెప్పిన మాట నెరవేరుతుందనేది తెలుస్తుందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.

♦సెక్షన్‌కు 30 మంది అమలైతేనే..

మూడో తరగతి నుంచి పూర్తిస్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమిస్తేనే వేలాదిమంది ఎసీˆ్జటీలకు పదోన్నతులు లభిస్తాయి. సెక్షన్‌కు 40 మంది విద్యార్థులు కాకుండా 30మందిని ఉంచి వారికి ఉపాధ్యాయులను కేటాయిస్తే పదోన్నతులు సాధ్యమవుతాయనే ఆశాభావంతో ఉన్నాం.- 

– బేతాళ రాజేంద్రప్రసాద్, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి