AP PRC : ఫుల్ జోష్‌‌లో ఉద్యోగ సంఘాలు.. చర్చలకు రావాలన్న సర్కార్, వెళుతారా ? లేదా ?

 AP PRC : ఫుల్ జోష్‌‌లో ఉద్యోగ సంఘాలు.. చర్చలకు రావాలన్న సర్కార్, వెళుతారా ? లేదా ?

PRC Sadhana Samithi : ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో విజయవాడ సక్సెస్ కావడంతో ఉద్యోగ సంఘాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం చలో విజయవాడకి వచ్చే వారిని అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నాయకులు ఖండించారు. సీఎస్, సజ్జల వ్యాఖ్యలపై 2022, ఫిబ్రవరి 04వ తేదీ శుక్రవారం జరిగే భేటీలో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. శనివారం, ఆదివారం సహాయ నిరాకరణ ప్రకటించనన్నారు. 6వ తేదీ రాత్రి నుండి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే

మరోసారి చర్చలకు రమ్మంటోంది ఏపీ ప్రభుత్వం. చర్చలకు రావాలంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పాటు సీఎస్‌ సమీర్‌ శర్మ ఆఫర్‌ చేశారు. దీంతో ఏపీ పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ మరోసారి భేటీకానుంది. మరికాసేపట్లో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే.. రేపు, ఎల్లుండి సహాయ నిరాకరణ చేస్తామని.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటిచింది స్టీరింగ్‌ కమిటీ. అయితే.. ఇవాళ జరిగే చర్చల్లో సీఎస్‌, సజ్జల ఆఫర్‌పైనా.. భవిష్యత్‌ కార్యాచరణపైనా చర్చించనున్నారు పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు.

అయితే పీఆర్సీ పోరులో వెనక్కి తగ్గకూడదని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగులపై చర్యలు తప్పవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించడంతో.. కేసులు పెడితే ఎలా ఎదుర్కోవాలన్నదానిపై అడ్వకేట్‌లతో లీగల్‌ ఒపినియన్ తీసుకున్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. అశుతోష్‌మిశ్రా కమిషన్‌ రిపోర్టు ఇవ్వకుంటే చర్చలకు వచ్చేది లేదని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. అయితే ప్రభుత్వం మాత్రం ముందుగా ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని పిలుపునిచ్చాయి. దీంతో ఉద్యోగులు చర్చలకు వెళతారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

Flash...   All BANKS IFSC AND MICR CODES IN INDIA