Corona Virus: వైరస్‌ను సంహరించే కొత్త నానో మాస్క్‌

 Corona Virus: వైరస్‌ను సంహరించే కొత్త నానో మాస్క్‌

హైదరాబాద్‌: కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించే సరికొత్త నానో మాస్క్‌లను హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూమెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి స్వీయ క్రిమిసంహారకంగా పనిచేయడంతో పాటు భూమిలో సులువుగా కలిసిపోయే బయో డిగ్రేడబుల్‌ నూలు (కాటన్‌) మాస్క్‌లు. రాగి ఆధారిత నానో పార్టికల్‌ కోటెడ్‌ ఫ్యాబ్రిక్‌తో యాంటీ వైరల్‌ మాస్క్‌ను శాస్త్రవేత్తలు డాక్టర్‌ టి.నర్సింగరావు, డాక్టర్‌ కల్యాణ్‌ హెబ్రమ్‌, డాక్టర్‌ బి.వి.శారద బృందం తయారు చేశారు. సీసీఎంబీలో పరీక్షించగా 99.9 శాతం వైరస్‌, బ్యాక్టీరియా నుంచి స్వీయ క్రిమిసంహారకంగా పనిచేశాయని ఏఆర్‌సీఐ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ టి.నర్సింగరావు తెలిపారు. ‘రాగిలో బ్యాక్టీరియాను చంపే గుణముంది. 

అందుకే రాగి ఆధారిత నానో కాంపోజిట్‌ పార్టికల్‌ కోటెడ్‌తో మాస్క్‌లను తయారు చేశాం. బెంగళూరుకు చెందిన రెసిల్‌ కంపెనీ నూలు వస్త్రంపై కాపర్‌ నానో కాంపోజిట్‌ పార్టికల్స్‌ను అద్దుతోంది. కంపెనీలు ముందుకొస్తే పెద్దఎత్తున తయారీకి అప్పగిస్తాం’ అని నర్సింగరావు తెలిపారు.

Flash...   Coal India లిమిటెడ్ నుండి 560 Management Trainee ఉద్యోగాలు