𒊹︎︎︎ జీతాల సంగతేంటి ?
𒊹︎︎︎ సడలింపులతో బిల్లుల కోసం కుస్తీ
𒊹︎︎︎ చేతులెత్తేసిన డ్రాయింగ్ అధికారులు
𒊹︎︎︎ శనివారం వరకూ చేరని బిల్లులు
𒊹︎︎︎ నెలాఖరు వరకూ గడువు పొడిగింపుఅయినా మందకొడిగానే పని
𒊹︎︎︎ డీడీవోలకు అందుబాటులోకి రాని వేతన ఖాతాలు
ఉద్యోగుల వేతనాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి నెల వేతనాలు వస్తాయా.. రావా? అన్న సందేహం వారిని వెంటాడుతోంది. కొత్త పీఆర్సీ అమలు పేరిట గత నెల ప్రభుత్వం సృష్టించిన గందరగోళం ఈ నెల వేతనాలపై పడింది. వేతన బిల్లుల రూపకల్పన గడువు ఈ నెల 25గా ప్రకటించిన ఆర్థిక శాఖ రాష్ట్రంలో ఎక్కడా బిల్లులు జరగలేదని తేలడంతో గడువును నెలాఖరుకు పొడిగించింది. అయినా బిల్లులు మాత్రం ఖజానా శాఖకు చేరే సూచన కనిపించడం లేదు.
ALSO READ:
TIS: UPDATE YOUR TEACHER INFORMATION DETAILS
➪ (ఏలూరు–ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 27 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఫిబ్రవరి వేతనాలు మార్చి 1న ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన బిల్లులన్నింటినీ డ్రాయింగ్ అధికా రులు ఫిబ్రవరి 25కు ఖజానా శాఖకు పంపుతారు. వాటిని ఖజానా అధికారులు పరిశీలిం చి ఆమోదిస్తేనే వీరికి మార్చి 1న వేతనాలు వస్తా యి. శనివారం వరకూ ఫిబ్రవరి వేతన బిల్లు ఒక్క టి ఖజానా శాఖకు చేరలేదు. ఒకటీ, అరా చేరినా వాటికి సంబంధించి జనవరి వేతన బిల్లులు అధి కారులకు కనిపించకపోవడంతో వాటిని ప్రాసెస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 1,600 మంది డ్రా యింగ్ అధికారులు బిల్లుల రూపకల్ప నకు వారం రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నా బిల్లులను రూపొందించలేకపోయారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల వేతన బిల్లులు రూపొందించా లంటే ఆయా ఉద్యోగుల వేతన ఖాతాలు డ్రాయిం గ్ అధికారుల లాగిన్‌లోకి రావాలి. అప్పుడే ఆయా ఉద్యోగి వేతన బిల్లు జనరేట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకూ ఉద్యోగుల వేతన ఖాతాలు డ్రాయింగ్ అధికారుల లాగిన్‌లోకి రాలేదు. పేరోల్ ఖాతాలో వేతన ఖాతాలు వస్తాయని శుక్రవారం వరకూ అధికారులు చెబుతూ వచ్చారు. శనివారం ఉదయం సీఎఫ్‌ఎంఎస్‌లో ఉద్యోగుల వేతన ఖాతా లు కనిపిస్తున్నాయని ప్రచారం జరిగినా వేతన బిల్లులు రాలేదు. కొత్త పీఆర్సీ ప్రకారం సాఫ్ట్‌వేర్ ను అప్‌డేట్ చేయాలి. ప్రస్తుతం ఇదే సమస్యగా మారింది.
𒊹︎︎︎ రెండు రోజులే గడువు.
మరో రెండు రోజుల్లో ఒకటో తేదీ రాబోతోంది. ఒకటో తేదీ శివరాత్రి సెలవు కావ డంతో ప్రభుత్వానికి ఒకరోజు అదనంగా కలిసి వచ్చింది. అయితే రెండో తేదీ నాటికైనా ఉద్యోగు లకు జీతాలు రావడం సందేహమే. ఈ నెల 25లోపు చేరిన బిల్లులకు మాత్రమే ట్రెజరీ శాఖ ఆమోదం లభిస్తుంది. ఆలస్యమైన బిల్లుల విషయంలో ప్రతి నెలా మధ్యంతర బిల్లులు పెట్టుకునే వెసులు బాటు ఉండేది. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చిలో ఫ్రీజింగ్ విధించింది. దీనికి తోడు జనవరిలో గందరగోళ వేతనాల సవరణ ట్రెజరీ ఉద్యోగులకు చుక్కలు చూపి స్తోంది. జనవరి బిల్లు సరిచేసి, ఫిబ్రవరి బిల్లులు ఓకే చేయాలని చెప్పడంతో పని కదలడం లేదు. రాష్ట్ర ఆర్థికశాఖ వేతన బిల్లుల రూపకల్పనకు నెలాఖరు వరకు వెసులుబాటు కల్పించింది. జనవరి వేతనాల విషయాన్ని పక్కన పెట్టి ఫిబ్రవరి బిల్లులను ఓకే చేయాలని ఆదేశించినా పని ముందుకు సాగడం లేదు. సాయంత్రానికి ఒకట్రెండు బిల్లులు ట్రెజరీకి చేరినట్టు తెలు స్తోంది. ఆదివారం కూడా ఉద్యోగులతో పని చేయించి బిల్లుల ప్రక్రియ పూర్తి చేయాలని ట్రెజరీ అధికారులు కుస్తీ పడుతున్నారు.
𒊹︎︎︎ గడువు పొడిగించాం.
వేతన బిల్లులను ట్రెజరీ శాఖకు పంపే గడువు నెలాఖరు వరకు పొడిగించాం. బిల్లులు ఒక్కొక్క టిగా వస్తున్నాయి. వాటిని పరిశీలించి ఆమోదిస్తున్నాం. ఉద్యోగులందరికీ ఒకటో తేదీకే వేతనాలు అందేలా ప్రయత్నిస్తున్నాం.
✰ ఎ.గణేశ్, ట్రెజరీ శాఖ ఏడీ