HEALTH TIPS: మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా ? అయితే మీకు ప్రోటీన్ లోపం ఉన్నట్లే

 మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా ? అయితే మీకు ప్రోటీన్ లోపం ఉన్నట్లే.. ఎలా అధిగమించాలంటే.

ప్రస్తుత ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. ప్రోటీన్స్, ఖనిజాలు, విటమిన్స్, ఐరన్, కాల్షియం లోపం వలన అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. ఇందుకు కారణం సరైన ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఇందులో ప్రోటీన్స్.. మన కండరాలను బలంగా మార్చేందుకు సహాయపడతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంటాయి. శరీరంలో మాంసకృత్తులు లేకపోవడం వలన అనేక రకాల ఇబ్బందులు పడుతుంటాయి. అయితే శరీరంలో ప్రోటీన్ లోపాన్ని కొన్ని లక్షణాలతో సులభంగా కనిపెట్టవచ్చు. అవెంట తెలుసుకుందామా.

శరీరంలోని పలు అవయవాలలో వాపు రావడం.. దీనినే వైద్యా భాషలో ఎడెమా అంటారు. రక్తంలో ఉండే ప్రోటీన్ అయిన హ్యూమన్ సీరం అల్బుమిన్ లోపం వలన అవయవాలలో వాపు వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే శరీరంలో ఏ అవయవంలోనైనా వాపు వస్తే అశ్రద్ధ చేయకూడదు.

శరీరంలో ప్రోటీన్ లేకపోవడం వలన కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. నిజానికి ప్రోటీన్ లేకపోవడం వలన కాలేయంలో కొవ్వు పెరుగుతుంది. ఇది కాలేయ వాపు, గాయాలు, కాలేయం పనిచేయకపోవడం వంటి సమస్యలు పెరుగుతాయి. స్థూలకాయం లేదా ఎక్కువగా మద్యం సేవించేవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంది.

అలాగే చర్మం, జుట్టు, గోళ్లపై కొన్ని లక్షణాలు ఈ ప్రోటీన్ లోపాన్ని సూచిస్తాయి. ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడతాయి. చర్మంపై ఎర్రటి మచ్చలు.. మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. జుట్టు బలహీనంగా అవడం.. జుట్టు రాలడం జరుగుతుంది. గోర్లు సన్నగా మారడం.. వాటి ఆకారం మారిపోవడం.. ప్రతీసారి విరిగిపోవడం జరుగుతుంది.

ఎముకలను దృఢంగా ఉంచడంలో ప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో మాంసకృత్తుల లోపం ఉంటే.. శరీర పనితీరు.. అవసరమైన కణజాలాల కోసం ఎముకల నుంచి ప్రోటీన్ తీసుకోవడం ప్రారంభిస్తుంది. దీంతో కండరాలు బలహీనపడడంతోపాటు.. ఎముకలు పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.

ప్రోటీన్ లేకపోవడం వలన రోగ నిరోధక వ్యవస్థపై కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇటీవల ఓ అధ్యాయనం ప్రకారం వృద్ధులలో వరుసగా 9 వారాల పాటు. ప్రోటీన్ లేకపోవడం వలన శరీరం నిస్సత్తువగా మారుతుంది

Flash...   మన ఫోన్ ఎవరైనా హాక్ చేశారేమో అని ఈ కింది విధంగా ఈజీ గా తెలుసుకోండి