High BP: బీపీ ఎక్కువగా ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు..!

High BP: బీపీ ఎక్కువగా ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు..!

High BP: హై బీపీకి శాశ్వత నివారణ లేదు. మందులు, కొన్ని ఆహారాల ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. సాధారణ రక్తపోటు 120/80గా పరిగణిస్తారు. అంతకు మించి ఎక్కువగా ఉంటే హై బీపీ కిందకి వస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే అది గుండెకు హాని కలిగిస్తుంది. అందువల్ల హై బీపీ రోగులు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారలను తినకపోవడమే మంచిది. అలాంటి ఐదు ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. కెఫీన్

అధిక రక్తపోటు ఉన్న రోగులు కెఫిన్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. వారికి కాఫీ, సోడా వంటి పానీయాలు చాలా హానికరం. వీరు వీటికి దూరంగా ఉంటే మంచిది.

2. సుగంధ ద్రవ్యాలు

అధిక స్పైసి ఫుడ్ హై బీపీ రోగులకు చాలా హానికరం. ఇందులో ఉపయోగించే మసాలాలు రక్తపోటు సమస్యను మరింత పెంచుతాయి. తక్కువ మసాలాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి.

3. షుగర్

అధిక రక్తపోటు రోగులు షుగర్ లేదా తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ చక్కెర తినడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇది అధిక రక్తపోటుని మరింత పెంచుతుంది.

4. ఉప్పు

అధిక రక్తపోటు రోగులకు ఉప్పు విషం కంటే తక్కువేమి కాదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

5. ప్యాకెట్ ఫుడ్

అధిక రక్తపోటు ఉన్న రోగులు ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. ప్యాక్ చేసిన ఆహారాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటుకు సోడియమే ప్రధాన కారణం.

6. ఆహార పదార్థాలను నిల్వ చేయాలంటే ఉప్పు అవసరం. ఎందుకంటే ఆహారం త్వరగా పాడవకుండా ఉప్పు కాపాడుతుంది. ఇది అధిక రక్తపోటు రోగులకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇందులో ముందుగా ఊరగాయలు వస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది.

ఇవి చదవండి 

Flash...   ఎట్టకేలకు టీచర్ల ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితా