INDIA POST: పోస్టాఫీస్ ఖాతాదారులకు గమనిక… డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గింపు

 పోస్టాఫీస్ ఖాతాదారులకు గమనిక… డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గింపు


పొదుపు ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) బ్యాడ్ న్యూస్ అందించింది. ఖాతాదారులు పొదుపు ఖాతాల్లో చేసే జమపై వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న వడ్డీ రేట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. రూ.1 లక్ష వరకు చేసే డిపాజిట్‌పై 2.25% వడ్డీరేటు, రూ.1 లక్ష-రూ.2 లక్షల వరకు జమ చేసే డిపాజిట్లపై 2.50% వడ్డీ మాత్రమే లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఈనెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పోస్టాఫీస్ అధికారులు వెల్లడించారు.

గతంలో పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభిస్తే, లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.75% వడ్డీ రేటు లభించేది. రోజువారీ బ్యాలెన్స్ మీద కొత్త వడ్డీ రేటు లెక్కిస్తారు. రోజువారీ ఈవోడి బ్యాలెన్స్ మీద లెక్కించిన వడ్డీని 3 నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేయనున్నారు. కాగా ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ గత నెలలోనే 5 కోట్ల మంది కస్టమర్లకు చేరుకొని సరికొత్త మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే.

Flash...   ఉద్యోగుల్లో వార్.. బొప్పరాజు వర్సెస్ వెంకట్రామిరెడ్డి.