IRCTC టూర్ ప్యాకేజీ: తక్కువ ధరకే తిరుమల టూర్ వెసెయ్యండి … !
తిరుమల వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఐఆర్సీటీసీ టూరిజం మరో టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితం. ఇక ఈ టూర్ కోసం పూర్తి వివరాల లోకి వెళితే… గోవిందం టూర్ పేరుతో ఈ రైల్ టూర్ ప్యాకేజీని IRCTC అందిస్తోంది. ఈ టూర్ మొత్తం మూడు రోజులు, రెండు రాత్రుల టూర్ ఉంటుంది. ట్రైన్లో పర్యాటకుల్ని తిరుపతికి తీసుకెళ్తుంది. తిరుచానూర్ కూడా చూడచ్చు
పైగా ఈ ప్యాకేజీ ప్రతీ రోజు కూడా అందుబాటులో ఉంటుంది. రెండుమూడు రోజుల పాటు తిరుమల వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీ బాగుంటుంది. ఇక ఈ టూర్ వివరాలని చూస్తే… మొదటి రోజు టూర్ లింగంపల్లిలో మొదలు అవుతుంది. లింగంపల్లిలో సాయంత్రం 5.25 గంటలకు, సికింద్రాబాద్‌లో 6.10 గంటలకు, నల్గొండలో రాత్రి 7.38 గంటలకు ఎక్కాలి. రాత్రి రైలు లో ప్రయాణం చెయ్యాలి.
రెండో రోజు తెల్లవారుజామున 5.55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ప్రయాణికుల్ని ఐఆర్సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. ఉదయం 8.30 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవచ్చు.
తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతిలోని హోటల్ కి తీసికెళ్తారు. భోజనం అయ్యాక తిరుచానూర్ తీసుకెళ్తారు. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ కి తీసికెళ్తారు. సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ గల రైలు ఎక్కితే మూడో రోజు తెల్లవారుజామున 3.04 గంటలకు నల్గొండలో, 5.35 గంటలకు సికింద్రాబాద్‌లో, 6.55 గంటలకు లింగంపల్లి రైలు చేరుకుంటుంది.
ధరలు విషయానికి వస్తే…స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,690, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,770, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.4,510. కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,540, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,630, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,370. మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
MORE AT https://www.tirupatihelps.com/irctc-sheegra-darshanam-tirupati-balaji-package/