JEE MAINS EXAM 2022: JULY 3, 2022 న జేఈఈ అడ్వాన్స్‌ EXAM

 న్యూఢిల్లీ: జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

జూన్‌ 8 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

– బ్రోచర్‌ విడుదల చేసిన ఐఐటీ బాంబే

– ఏప్రిల్‌ 2వ, మే 4వ వారంలో మెయిన్‌ పరీక్షలు!

★ ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి ఈసారి జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష (ఆన్‌లైన్‌లో) నిర్వహించనున్నారు. 

★ జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించే విద్యార్థులు ఆ పరీక్షకు జూన్‌ 8 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

★ జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2022 నిర్వహిస్తున్న ఐఐటీ బాంబే గురువారం సమగ్ర వివరాలతో బ్రోచర్‌ విడుదల చేసింది. 

★ పరీక్ష ఫలితాలను జులై 18న వెల్లడిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్‌ మొదలవుతుంది.

బాలికలకు 20% సీట్లు

★ ఈసారి ప్రతి ఐఐటీలో కనీసం 20 శాతం సీట్లను సూపర్‌ న్యూమరరీ కింద బాలికలకు కేటాయిస్తారు.

★ 2020, 2021లో అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు పేరు నమోదు చేసుకొని పరీక్ష రాయలేకపోయిన వారు ఈసారి నేరుగా జేఈఈ మెయిన్‌ రాయకుండానే అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరుకావొచ్చు.

★ అడ్వాన్స్‌డ్‌లో కనీస మార్కులు సాధించిన వారు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష రాయవచ్చు. అందుకు జులై 18, 19 తేదీల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. పరీక్షను అదే నెల 21న నిర్వహిస్తారు. ఫలితాలను 24న వెల్లడిస్తారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు..

★ ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, పాల్వంచ, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు..

★ అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కావలి, కర్నూలు, మచిలీపట్నం, మార్కాపురం, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం.

Flash...   Not to sanction ACRs to merging affected schools : Certain instructions on construction of ACRs in Schools