LIC పాలసీదారులకు అలర్ట్…ఈ పాలసీల్లో మార్పులు…!

 LIC పాలసీదారులకు అలర్ట్…ఈ పాలసీల్లో మార్పులు…!


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. వీటి వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పిల్లల నుండి పెద్దల వరకు ఎన్నో పాలసీలని తీసుకు వచ్చింది. ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల పలు రకాల లాభాలు పొందొచ్చు. అయితే ఈ పాలసీల్లో చేరడం వలన రక్షణ, రాబడి రెండూ ఉంటాయి. అయితే తాజాగా రెండు పాలసీలకు సంబంధించి మార్పులు చేసింది.

ఇక వాటి కోసం చూస్తే.. జీవన్ అక్షయ్ పాలసీ, న్యూ జీవన్ శాంతి పాలసీల్లో మార్పులు చెయ్యడం జరిగింది. కనుక పాలసీదారులు ఈ విషయాన్ని గుర్తించాలి. వీటిని తెలుసుకుంటే మీకూ సమస్యలు కలగవు. జీవన్ అక్షయ్, న్యూ జీవన్ శాంతి పాలసీలకు సంబంధించి యాన్యుటీ రేట్లను సవరించినట్లు తెలిపింది. అయితే ఈ కొత్త రేట్లతో పాలసీలు ఈ నెల ఒకటి నుండి అమలులోకి వచ్చాయి.

ALSO READ: 

LIC JEEVAN LABH: రూ.60 పొదుపుతో రూ.13 లక్షలు మీ సొంతం;

LIC పాలసీ దారులకు శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డు

LIC ONLINE PAYMENT OFFICIAL ANDROID APP

రెండు పాలసీలు తీసుకోవాలని భావించే వారు కొత్త యాన్యుటీ రేట్లు ఎలా ఉన్నాయో తప్పక తెలుసుకోవాలి. ఈ రేట్లని ఈజీగా ఎల్ఐసీ వెబ్‌సైట్‌లోని క్యాలిక్యులేటర్ సాయంతో లెక్కించచ్చు. యాన్యుటీ రేట్ల సవరణతోపాటు ఈ రెండు పాలసీలు కొత్త డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఏ పాలసీ తీసుకోవాలన్నా కూడా మొదట మీరు ప్లాన్స్ కి సంబంధించి వివరాలను తప్పక తెలుసుకోవాలి.

Flash...   FA4 MARKS ENTRY LINK MARCH 2023