LIVE: ఛలో విజయవాడలో టెన్షన్ టెన్షన్..

 

LIVE: ఛలో విజయవాడలో టెన్షన్ టెన్షన్..






ఎవ్వరూ తగ్గట్లేదు..
చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి లేనందున
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌దగ్గర నార్త్‌ సబ్ డివిజన్‌ డీఎస్పీ
రాంబాబు ఆధ్వర్యంలో వాహన తనిఖీలను పరిశీలించారు. అటు కనకదుర్గ వారధి
దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు
చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న వారిని సైతం ప్రశ్నించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలోకి అడుగుపెట్టకుండా పోలీసులు
కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. విజయవాడ-జగదల్‌పూల్‌ హైవేపై ఐదు
చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం
వరకు చెక్‌పోస్ట్‌లు పెట్టారు.

పంతం మీదా మాదా ..

ఉద్యోగుల్ని చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనకుండా ప్రభుత్వం
కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే..ఉద్యోగులు మాత్రం ఎలాగైనా వెళ్లి
తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్‌లలో పోలీసులు
అడ్డుకుంటున్నారని తెలిసి మార్గం మధ్యలోనే ట్రైన్‌ చైన్‌ లాగి
విజయవాడకు వేర్వేరు మార్గాల ద్వారా చేరుకుంటున్నారు. మరికొన్ని
ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు మారు వేషాల్లో విజయవాడకు
బయలుదేరడంతో పోలీసులు వాళ్లను మార్గం మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేసి
పార్వతీపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


ఇవాళ ఏం జరుగనుందో..

పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా తాము చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో చలో
విజయవాడ ఒకటని..దాన్ని ఈవిషయాన్ని గతంలోనే సీఎస్‌కు చెప్పినట్లు
తెలిపారు పీఆర్సీ సాధన సమితి నేతలు. చలో విజయవాడ వాయిదా వేసుకునే
విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం
చేయడంతో పోలీసులు ఎక్కడిక్కడ కార్యక్రమానికి వెళ్లే వారిని నిలువరించే
ప్రయత్నం చేస్తున్నారు.

Flash...   Releasing the CRCs (School Complexes 4028 in the State) Grant to the APCs int he State - Orders