Police Station కి వెళ్లిన 10వ తరగతి విద్యార్థులు..!

జుట్టు కత్తిరించుకొని నీటుగా రండన్నందుకు.. పిర్యాదు చేసేందుకు పోలీస్
స్టేషన్ వెళ్లిన 10వ తరగతి విద్యార్థులు..!


-తమను HM , ఉపాధ్యాయులు కొడుతున్నారని బుకాయింపు -విద్యార్థుల
తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించిన హెచ్ఎం -టీసీలు ఇచ్చేస్తాం విద్యార్థులను
తీసుకెళ్లాలని సూచన 

ఉరవకొండ, : పాఠశాలకు చింపిరి జుట్టును కత్తిరించుకున్న తరువాతే రండని
ప్రధానోపాధ్యాయురాలు గట్టిగా మంద లించిన క్రమంలో పట్టణంలోని జెడ్సీ సెంట్రల్
ఉన్నత పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులు హెచ్ఎం, ఇతర ఉపాధ్యాయులపై
చేయడానికి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఉరవకొండలో సంచలనం రేకెత్తించింది.
వివరాల్లోకి వెళితే… స్థానిక సెంట్రల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను
క్రమశిక్షణలో పెట్టడానికిగాను ఇటీవలి కాలంలో ఉపాధ్యాయులు చేపట్టిన చర్యలు
కొందరు ఆకతాయి విద్యార్థులు-ఉపాధ్యాయులకు మధ్య తీవ్ర ఆగాదాన్ని సృష్టిస్తోంది.
విద్యార్థులు ఇష్టారాజ్యంగా క్రాప్ చేయించుకొని వచ్చి ఇతర విద్యార్థులను
చెడగొడుతుండటం, వారి నడవడిక సరిగ్గా లేకపోవడం, ఉపాధ్యాయులపైనే విమర్శలు చేయడం
లాంటివి అధికం కావడంతో ఇటీవలే కొత్తగా వచ్చిన హెచ్ఎం రాజేశ్వరి తోటి ఉపాధ్యాయుల
అభ్యర్థనతో కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే పలువురు 10వ తరగతి
విద్యార్థులను పిలిచి మీరు పద్ధతిగా కటింగ్ చేయించుకున్న తరువాతే పాఠశాలకు
రండని చెబుతూ వచ్చారు. అయితే మార్పు లేకపోవడంతో శుక్రవారం వారిని బయటకు
విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానికులను మభ్యపెట్టేందుకుగాను హెచ్ఎం,
ఉపాధ్యాయులే తమను ఉద్దేశపూర్వకంగా కొడుతున్నారని బుకాయించే క్రమంలో పిర్యాదు
చేయడానికి స్టేషన్కు వెళ్లినట్లు స్పష్టమైంది. పోలీస్ స్టేషన్కు వెళ్లిన 13
మంది 10వ తరగతి విద్యార్థులను పాఠశాలకు రప్పించిన హెచ్ఎం వారి కుటుంబ సభ్యులను
పిలిపించి విద్యార్థులు క్రమశిక్షణా రాహిత్యం, దుకుడును వారికి వివరించారు.
తానుచెడ కోతి వనానంతటినీ చెడివిందని వీరు ఇతర విద్యార్థులను చెడగొడుతున్నారని
టీసీలు ఇస్తార మీ పిల్లలను తీసుకెళ్లమని సూచించారు దీంతో తల్లిదండ్రులు ఒక్క
అవకాశం ఇవ్వమని అడిగిన క్రమంలో వారితో సయాయిషీ లేఖలు రాయించుకున్నారు.

ALSO READ

SBI 3 in 1 offer: SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!

Flash...   Nadu Nedu Expenditure Statement component wise in one click

SBI Loans: Online లో సుల‌భంగా SBI ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్‌ లోన్స్‌

SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

ఉపాధ్యాయులకే ఎదురుతిరిగి దూషిస్తున్నారు: కొందరు 10వ తరగతి విద్యార్థులు
తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పే పాదాలు వినకుండా. ఇతర విద్యార్థులను కూడా
ఇబ్బందులు పెడుతూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. వారిని మందలిస్తే ఎదురుతిరిగి
మేము ఇక్కడే సిగరెట్లు, మందు తాగుతారు. ఏం చేస్తారో చేసుకోండని మొతున్నారని
హెచ్ఎం రాజేశ్వరి వాపోయారు. అంతే కాకుండా నాడు-నేడు కింద చేసిన కుళాయిలు,
switch బోర్డులను సైతం 
ధ్వంసం    చేస్తున్నారని వారితో వేగలేకున్నామని వివరించారు.