PRC NEWS| ఉద్యోగులు స‌మ్మెకు వెళ్ల‌కుండా చూడండి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్‌ ఆదేశాలు

 ఉద్యోగులు స‌మ్మెకు వెళ్ల‌కుండా చూడండి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్‌ ఆదేశాలు


వివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తోన్న‌ ఉద్యోగులు స‌మ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, చ‌ర్చ‌ల ద్వారా స‌మ్మెకు వెళ్ల‌కుండా ఆపాలంటూ.. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, హెచ్‌వోడీల‌కు ఆదేశాలు జారీ చేశారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సమీర్ శర్మ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నఆందోళన కార్యక్రమాలపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వివిధ అంశాలను చర్చలు ద్వారా పరిష్కరించుకునేందుకు ఆందోళనను విరమించి ముందుకు వచ్చేలా ఉద్యోగ సంఘాలను ఒప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను ఆదేశించారు.

ఆర్ధికశాఖ అధికారులు, జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వ‌హించిన సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. ఈసందర్భంగా ఉద్యోగులంటే మనంతా ఒక కుటుంబమని ఏదైనా సమస్య వస్తే కూర్చుని అంతర్గంతంగా చర్చించు కుందామని చెప్పిజిల్లా కలక్టర్లు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిపి మట్లాడి ఒప్పించాలని చెప్పారు.. మనం అందరం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలో భాగమని మన మెరుగైన సేవలు ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులుగా మనకు ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక యంత్రాంగం ఉందని ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేయాలన్నారు. ప్ర‌స్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఉద్యోగులు సమ్మెకు వెళితే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయనేది ప్రతి ఉద్యోగి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ తదిపరి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్ళాలనుకునే విద్యార్ధులు, ఆసుపత్రుల నుండి బయటికి వచ్చే కరోనా రోగుల పరిస్థితులను, కోవిడ్ ఇబ్బందుల నుండి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వ్యాపార వాణిజ్య కార్య కలాపాలకు ఏవిధంగా ఇబ్బందులు కలుగుతాయో ఉహించుకోవాలని సీఎస్ ఉద్యోగులకు సూచించారు. ప్రభుత్వం మీవెంటే ఉందనే విషయాన్నిఉద్యోగులకు తెలియజేసి అందరూ కలిసి పని చేద్దామని సమస్యలుంటే చర్చలు ద్వారా పరిష్కరించు కుందామని తెలియజేయాలని జిల్లా కలక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. కేవలం చర్చలు ద్వారానే అన్ని విషయాలు పరిష్కారం అవుతాయని కావున ఆదిశగా ఉద్యోగ సంఘాలను చైతన్యపర్చి ఆందోళన విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.

Flash...   OTT Release Movies: ఓటీటీల్లోకి ఒకేరోజు 33 సినిమాలు రిలీజ్.. ఆ మూడు మాత్రం!