PRC NEWS| హెచ్ఆర్ఏ, ఫిట్‌మెంట్‌పై ఏపీ స‌ర్కార్ తాజా ప్ర‌తిపాద‌న‌లు..!

 హెచ్ఆర్ఏ, ఫిట్‌మెంట్‌పై ఏపీ స‌ర్కార్ తాజా ప్ర‌తిపాద‌న‌లు..!


మ‌ంత్రుల క‌మిటీతో జ‌రిగిన‌ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశంలో ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌తిపాద‌న‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.. హెచ్ఆర్ఏపై ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌తిపాద‌న‌లు చేసిన‌ట్టు స‌మాచారం.. హెచ్ఆర్ఏ శ్లాబుల్లో కీల‌క స‌వ‌ర‌ణ‌ల దిశ‌గా చ‌ర్చ‌లు సాగాయి.. మంత్రులు నాలుగు శ్లాబులు ప్ర‌తిపాదించిన‌ట్లు స‌మాచారం.. 2 లక్షల జనాభాలోపు ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగుల‌కు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్ర‌తిపాద‌న పెట్ట‌గా.. అదే 2 ల‌క్ష‌ల నుంచి 5 లక్షల జనాభా ఉంటే 12 శాతం హెచ్‌ఆర్‌ఏ, ఇక‌, 5-15 లక్షల జనాభా ఉన్న న‌గ‌రాల్లో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదించింది. 15 లక్షలకు పైగా జ‌నాభా ఉండే న‌గ‌రాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని పేర్కొంది ప్ర‌భుత్వం..

అడిష‌న‌ల్ క్వాంట‌మ్ ఆఫ్ పెన్ష‌న్ విధానంలోనూ కీల‌క ముంద‌డుగు ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది.. 70 ఏళ్లు పైబ‌డిన పెన్ష‌న‌ర్ల‌కు 5 శాతం అద‌న‌పు పెన్ష‌న్ స‌దుపాయం.. 75 ఏళ్లు పైబ‌డిన పెన్ష‌న‌ర్ల‌కు 10 శాతం అద‌న‌పు పెన్ష‌న్ స‌దుపాయం, 80 ఏళ్లు పైబ‌డిన పెన్ష‌న‌ర్ల‌కు 20 శాతం అద‌న‌పు పెన్ష‌న్ స‌దుపాయం క‌ల్పించ‌నున్న‌ట్టు ప్ర‌తిపాద‌న‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.. ఇక‌, ఫిట్‌మెంట్‌పైనా కీల‌క ఆలోచ‌న జ‌రిగిన‌ట్టుగా స‌మాచారం అందుతుండ‌గా.. 23 శాతం ఫిట్‌మెంట్‌కు గ‌తంలోనే అంగీక‌రించారు ఉద్యోగ సంఘాల నేత‌లు.. ఉద్యోగుల్లో అసంతృప్తితో ఫిట్‌మెంట్ పెంపుపై కూడా ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.. 24 శాతానికి పైబ‌డిన ఫిట్‌మెంట్ ఫిక్స్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్టుగా స‌మాచారం. మ‌రోవైపు.. ప‌దేళ్ల కేంద్ర పీఆర్సీకి బ‌దులు.. ఐదేళ్ల రాష్ట్ర పీఆర్సీకి సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది. అయితే, మంత్రుల క‌మిటీతో స్టీరింగ్ క‌మిటీ భేటీ సుదీర్ఘంగా సాగింది.. నాలుగున్న‌ర గంట‌ల‌కు పైగా స‌మావేశం జ‌రిగింది.

మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్లు

* పీఆర్సీ నివేదిక బయటపెట్టాలి.

* 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. కనీసం 27%కు తగ్గకుండా ఇవ్వాలి.

* హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లు పాతవే కొనసాగించాలి.

* సీసీఏ కొనసాగించాలి.

Flash...   Flipkart Electronic Day Sale 2022: 80 శాతం డిస్కౌంట్!!

* పింఛనర్లకు 70 ఏళ్లు దాటాక 10%, 75 ఏళ్లు దాటాక 15% అదనపు క్వాంటం వర్తింపజేయాలి.

* కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్‌సీ ప్రకారం పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.

* పొరుగు సేవల ఉద్యోగులకు మినిమమ్‌ టైం స్కేల్‌ ఇవ్వాలి.

* గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు నుంచి రెగ్యులర్‌ స్కేల్‌ ఇవ్వాలి. 2022 పీఆర్సీ స్కేలు అమలుచేయాలి.

* మార్చి 31 లోగా సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోవాలి.

* కేంద్ర పీఆర్సీ మాకు సమ్మతం కాదు. రాష్ట్ర పీఆర్సీనే కొనసాగించాలి