SBI special fixed deposit news… customers can withdraw fd funds via ATM in this special fixed deposit scheme
SBI Customers: భారతదేశంలో సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఒకటి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), దేశవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది వినియోగదారులకు వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తోంది. అందులో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఒకటి. ఇందులో ఎస్బీఐ పెట్టుబడిదారులకు ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM) ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ప్రత్యేక FD ప్లాన్ పేరు SBI మల్టీ ఆప్షన్ డిపాజిట్ (MOD) పథకం. పెట్టుబడిదారులు మల్టీ ఆప్షన్ డిపాజిట్ FD స్కీమ్‌లో కనీసం రూ.10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సమీపంలోని ఏదైనా SBI బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా ఖాతాను తెరవవచ్చు. అంతేకాదు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా సులభం. పెట్టుబడిదారులు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై బ్యాంక్ అందించే వడ్డీ రేటును అందుకుంటారు. పెట్టుబడి గరిష్ట పరిమితిపై ఎటువంటి పరిమితి లేదు. వడ్డీ మీ మల్టీ ఆప్షన్ డిపాజిట్ ఖాతాకు జమ అవుతుంటుంది.
ALSO READ
SBI 3 in 1 offer: SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!
SBI Loans: Online లో సులభంగా SBI ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్
SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!
మీ SBI అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా
అంతేకాకుండా ఈ స్కీమ్‌లోని ప్రత్యేకత ఏంటంటే మీ పెట్టుబడి పెట్టిన నిధులను ATMల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ అవకాశం మల్టీ ఆప్షన్ డిపాజిట్ (MOD) పథకంలో మాత్రమే ఉంటుంది. ఈ పథకం ప్రకారం.. పెట్టుబడిదారులు వారి FD ఖాతాలను విచ్ఛిన్నం చేయకుండా వారి FD ఖాతాల నుంచి అడ్వాన్స్‌లు తీసుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులు కావాలనుకుంటే మెచ్యూరిటీకి ముందు డబ్బును తీసుకునే సౌలభ్యం కూడా కల్పించారు. పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం మొబైల్ యాప్‌ని ఉపయోగించి ఇంటి నుంచి వారి FDలను బ్రేక్ చేయడానికి బ్యాంక్ అనుమతిస్తుంది. అప్పుడు మీరు ATM నుంచి డబ్బు తీసుకోవచ్చు.