TiS : HM చేసే Cadre Strength మరియు Teacher status ఒక అవగాహన

*చైల్డ్ ఇన్ ఫో లో HM చేసే Cadre Strength మరియు Teacher status – ఒక అవగాహన*



*1. Teacher status*:

Services లో staff నందు Teacher Status అనే tab ఉంటుంది.

ఇందులో మన పాఠశాల కి సంబంధించిన అందరు ఉపాధ్యాయులు కనబడతారు.

రిటైర్/ ట్రాన్స్ఫర్/ చనిపోయిన వారితో సహా.

HM  గారు వీరి పేర్ల ముందు ఉన్న చెక్ బాక్స్ లను నొక్కి వారి status ని సెలక్టు చేసుకుని submit చేస్తారు.

Submit చేయగానే ఆ ఉపాధ్యాయుడు రిటైర్ అయిన వారా? ట్రాన్స్ ఫర్ అయిన వారా?? వర్కింగ్ వారా??? అని status చూపిస్తుంది.

కాని పేర్లు అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి.

కంగారు పడవలసిన అవసరం లేదు.

( ఒకవేళ మనం పని చేసే వారిని అనుకోకుండా రిటైర్ అని చూపితే వారు కనబడకుండా పోతే తిరిగి పాఠశాలలో కి తెచ్చుకొనేందుకు ఇబ్బంది లేకుండా ఆ పేర్లు అక్కడే ఉంచడం జరుగుతుంది. వారి status మార్చితే తిరిగి working అవుతారు.)

*ఇప్పుడు HM  గారు working అని సెలక్టు చేసుకున్న వారు మాత్రమే ఆ పాఠశాల లో పని చేసే వారు.*

*వీరి పేర్లు మాత్రమే పైన ఉన్న* 

*cadre strength*  *అనే tab లోకి వెళ్ళి, అక్కడ కనబడతాయి.*

అంటే  వీరు మాత్రమే Active teachers అన్నమాట.

*2. ఇప్పుడు cadre strength ట్యాబ్*

Services లో staff లో cadre strength ట్యాబ్ నొక్కితే 

పైన పోస్ట్ ల పేర్లు, అవి ఎన్ని పోస్ట్ లు??, ఎంతమంది వర్కింగ్???

*పెండింగ్* ఎంత అని చూపిస్తుంది.

*ఇదే టేబుల్ కింద ఇంతకుముందు మనం 

*Teacher status* లో *working అని సెలక్టు చేసిన వారి పేర్లను  మాత్రమే ఇక్కడ display చేయడం జరుగుతుంది.*

ఆయా పేర్లలో  ఒక  category/ designation కి చెందిన ఎన్ని పేర్లు ఉంటే అంత నంబర్  working లో ఆటోమేటిక్ గా చూపిస్తుంది.మనం ఎంటర్ చేయవలసిన పని లేదు..

Flash...   GUIDELINES ON PROMOTIONS 13.01.2021

ఉదాహరణకు

ఇద్దరు School Assistant( Maths) టీచర్ల  పేర్లు కింద కనబడుతుంటే ….

working box  దగ్గర  2 డిస్ ప్లే ఆటోమేటిక్ గ వస్తుంది.

ఇప్పుడు HM గారు Sanction అనే బాక్స్ లో 1 అని కొడితే …అది తీసుకోదు.

ఇది ఓ  exception .  సిస్టం తీసుకోదు.ముందుకు వెళ్ళదు. ( ఇది పై అధికారికి తెలియజేయాలి)

Sanction బాక్స్ లో  2 అని కొడితే …. working ఇద్దరు ఉన్నారు కావున 

…pending box “0” చూపిస్తుంది.

Sanction box లో  3 కొడితే…

Working “2” కాబట్టి

Pending box లో “1” వస్తుంది.

ఈ విధంగా HMగారు Sanction నంబర్ మాత్రమే  ఎంటర్ చేయవలెను.

ఇప్పుడు


*pending* box లో ఎంత నంబర్ ఉంటే ఆ పోస్ట్ లో అంతమందిని మాత్రమే

Add  చేసుకోగలము.

కావున ప్రధానోపాధ్యాయులు అందరూ గమనించి ,అవగాహన చేసుకొని cadre strength submit చేయగలరు.

*Plz Remember* :

*ముందు Teacher Status ట్యాబ్ submit చేయాలి*

తదుపరి మాత్రమే Cadre strength  Tab పూర్తి చేయాలి.*

TIS LINK