WhatsApp: వాట్సాప్‌లో Red Heart ఎమోజీ పంపిస్తే.. రూ. 20 లక్షల జరిమానా

 WhatsApp: వాట్సాప్‌లో రెడ్‌ హార్ట్‌ ఎమోజీ పంపిస్తే.. రూ. 20 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష. ఎక్కడో తెలుసా.?


New Delhi: A cyber crimes expert from Saudi Arabia has warned the public against sending ‘red heart’ emojis on WhatsApp as it can land them in legal trouble.

A fine of SAR 100,000 (nearly Rs 20 lakh) can be levied, along with two to five years of jail, if the sender is found to be guilty, according to the law.

Gulf News reported that in a statement issued to a local newspaper, a member of the Anti-Fraud Association in Saudi Arabia, Al Moataz Kutbi said that sending these ‘red hearts’ on WhatsApp equals a ‘harassment crime’ in the country

WhatsApp: వాట్సాప్‌.. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆట్రాక్ట్‌ చేస్తుండడంతో ఈ యాప్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. అయితే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ మెసేజింగ్ యాప్స్‌పై పలు దేశాలు రకరకాల నిబంధనలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు తమ కంట్రీకి చెందిన యూజర్ల వాట్సాప్‌ హిస్టరీని తమ దేశంలోని సర్వర్లలోనే స్టోర్ చేయాలని కోరితే, మరికొన్ని యూజర్ల డేటాకు భద్రత కల్పించాలంటూ నిబంధనలు విధిస్తున్నాయి.

అయితే తాజాగా సౌదీ అరేబియా వాట్సాప్‌ యూజర్లకు ఒక షరతును విధించింది. వాట్సాప్‌లో ‘రెడ్‌ హార్ట్‌’ ఎమోజీని ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన యాంటీ ఫ్రాడ్‌ అసోసియేషన్‌ సభ్యుడు అల్‌ మోతాజ్‌ కుత్బీ తెలిపారు. ఇలా రెడ్‌ హార్ట్‌ ఎమోజీని పంపించిన వారికి 1 లక్ష సౌదీ రియల్స్‌.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 20 లక్షల జరిమానాగా విధిస్తారు. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు దోషిగా తేలితే ఏకంగా రూ. 60 లక్షల రూపయాలతో (3 లక్షల రియల్స్‌) పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు.

Flash...   విద్యార్థులపై కరోనా పంజా

ఇదిలా ఉంటే సౌదీలో ఎదుటి వాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్‌ చేయడాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే రీతిలో మెసేజ్‌లు చేసినా నేరమే. ముఖ్యంగా రెడ్‌ హార్ట్‌ ఎమోజీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అల్ మోతాజ్ కుత్బీ సూచించారు. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగిస్తే దాన్ని సౌదీ అరేబియా చట్టం ప్రకారం వేధింపుల కింద పరిగణిస్తారు. ఇందులో భాగంగానే  రెడ్‌ హార్ట్‌ ఎమోజీ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.