11వ వేతన సవరణ సంఘము (PRC) – అమలు తీరు ప్రశ్నావళి రూపంలో ఒక సమీక్ష CVS MANI PRTU

11వ వేతన సవరణ సంఘము (PRC) – అమలు తీరు ఒక సమీక్ష 11 వ వేతన సవరణ సంఘము మరియు దానిపై కార్యదర్శుల నివేదిక – వేతన సవరణ స్కేళ్ళు 2022 ప్రభుత్వఉత్తర్వులు – ప్రశ్నావళి రూపంలో ఒక సమీక్ష.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ మరియు విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉద్యోగవర్గాలు స్వప్నంలో కూడా తలవని విధంగా 11 వ వేతన సవరణసంఘ సిఫార్సులను ‘కార్యదర్శులకమిటీ’ అనే ఒక కోతల కమిటీ ‘బైపాస్’ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వము ‘PRC’ అమలు జి.ఓ.లు 1,2,5,6,7,8 లను విడుదల చేసినది. రాష్ట్ర ప్రభుత్వముతో ఉద్యోగసంఘాలు జనవరి 17 కు ముందు విడివిడిగా, జనవరి 17 తర్వాత PRC సాధన సమితి అనే ఉమ్మడి పోరాట వేదికద్వారా జరిపిన చర్చలు పాక్షిక విజయాన్నే సాధించిపెట్టినవి. సాక్షాత్తు రాష్ట్రాధినేతయే “మేము మీరు ఆశించిన రీతిలో” PRC ఫలాలు అందించ లేకపోయామని విచారం వ్యక్తం చేయటంతో ఉద్యోగసంఘాలు కూడా పట్టు-విడుపు ధోరణులతో ప్రభుత్వ | ఆలోచనలకు “ఊ” అనవలసి వచ్చినది. 20 మంది సభ్యులు గల  PRC సాధనసమితి’ ఫిబ్రవరి 4, 5 తేదీలలో మంత్రుల కమిటీతో చర్చలు జరిపిన అనంతరము, కొంచెం ఉప్పు – కొంచెం నిప్పు’గా ఉన్న ‘ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకారముతో తలాడించి వచ్చిన తర్వాత కొన్ని సంఘాల నాయకులు చివరి నిముషంలో మేము “ఒప్పుకోవటం లేదు” అని చెప్పి ఐక్య ఉద్యమానికి తూట్లు |పొడిచేవిధంగా నాయకులను వ్యక్తిగతంగా బాధ్యులను చేయటం ఐక్య ఉద్యమ అభిలాషులందరిని కలచి వేసింది. ఇలా కూడా ఉ పాధ్యాయులను మోసం చేయవచ్చునా? అని ముక్కు మీదు వేలేసుకొనేటట్లు చేసినది.teacherinfo.in ఫిట్మెంట్ 23% అనేది జనవరి 7 న గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒప్పందము పూర్తయినది | కనుక దానిని ఫిబ్రవరి 4, 5 తేదీలలో జరిగిన చర్చలలో తిరగదోడరాదని మంత్రులకమిటీ ముందే చెప్పి చర్చలకు ఉపక్రమించినది. “స్టీరింగ్ కమిటీ” అందుకు సమ్మతించే చర్చలలో పాల్గొనుట జరిగినది. కనుక ఈ చర్చల సారాంశములో అందరి బాధ్యత ఉన్నది.

PRC సాధన సమితి తన శక్తియుక్తులన్ని ఉపయోగించి ఏకపక్షంగా ప్రభుత్వాన్ని ఈ స్థాయి వరకు తేవటం అభినందనీయము. ఈ చర్చల వలన ఒకేసారి 4 డి.ఏ.లు సాధించటం గుడ్డిలోమెల్ల. ఏది ఏమైనా | ఈ 11 వ PRC ఫలాలు వేతన జీవులకు, సంఘాలకు అంత తృప్తి నివ్వలేదని, ఈ 11 వ PRC అపజయము మనది కాదు, ప్రభుత్వానిది అని చెప్పాలి. 5 ఏళ్ళకు ఒకసారి PRC పునరుద్ధరించుకోవడం సంతోషించదగ్గ విజయము.

ప్రశ్న : 11 వ PRC సిఫార్సులను ఎవరు చేశారు? ఈ సిఫార్సుల అమలుతో ప్రభుత్వం చేసిన ‘వినూత్న’ చర్య ఏమిటి? 

 జవాబు : G.O.No.75, GAD, dt. 28-5-18 ద్వారా 11వ వేతనసవరణ సంఘము (PRC) శ్రీ అశుతోష్ మిశ్రాగారి అధ్యక్షతన ఏక సభ్య కమీషన్ ఏర్పడినది. ఈ నివేదిక ది. 5-10-2020 న teacherinfo.in ప్రభుత్వానికి సమర్పించబడినది. ఈ సిఫార్సులను పరిశీలించుటకు ఛీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన 6 గురు IAS లచే ఒక కమిటీని G.O.Ms. No. 22 Fin, dt. 1-4-2021 ద్వారా ఏర్పాటుచేసినది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కమిటీ ఏర్పడటం ఒక వినూత్న సంప్రదాయం. ఈ కమిటీయే ‘ఉద్యోగులను’ ఇంత వ్యధకు గురి చేసినది. ప్రభుత్వము రాజకీయ నిర్ణయం తీసుకోకుండా నిరోధించినది.

Flash...   Nadu Nedu –Procurement of materials- Specifications-Brand names

ప్రశ్న :: 11 వ PRC సూచించిన ‘మాస్టరు స్కేలు’ ఏది?దాని వివరాలు,  ప్రత్యేకతలు ఏవి?

జవాబు : 11 వ వేతన సవరణ సంఘము (PRC) సూచించిన ‘మాస్టరుస్కేలు నే కార్యదర్శుల కమిటీ కూడ సిఫార్సు చేసినది.

20000-600 – 21800 -660-23780 720-25940 – 780-28980-850-30830-920-33590 – 990-36560 – 1080 39800 1170- 43310- 1250 – 47090 1350- 51140 1460 – 55520-1580-60260-1700 65360 -1830-70850-1960- 76730- 2090 -83000 2240-89720-2390-96890- 2540 – 104510-2700 112610-2890-121280 – 3100 – 1305803320- 140540 3610- 154950 – 3900 – 170580 – 4210 – 179000 (83 స్లాబులు)

ఈ మాస్టరు స్కేలులో 32 గ్రేడ్లు (రకాల స్కేళ్ళు) 83స్టేజీలు (గతంలో 81) ఉన్నవి. ఇంక్రిమెంటు రేంజ్ ప్రారంభస్టేజిలో 3% నుండి చివరిస్టేజిలో 2.34% తగ్గుతూ వచ్చినది. 72 స్టేజీల వరకు 3 ఏళ్ళకు ఒకసారి, 73-80 స్టేజీల వరకు 4 ఏళ్ళకు, చివరి 2 స్టేజీలకు 2 ఏళ్ళకు వేతన పెరుగుదల కాలవ్యధి (Periodicity) నిర్ణయించబడినది. ఇది 1-7-2018 నాటి 30.392% డి.ఏ.తో వేతనమునకు కలిపి నిర్ణయించబడిన స్కేలు. కనీసవేతనము రూ. 20,000, గరిష్ట వేతనము రూ.1,79,000. కనీస, గరిష్ట వేతనముల నిష్పత్తి 1:8.95.

మాస్టరు స్కేలు దాటిన వేతనమునకు 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వబడినవి.

ప్రశ్న: 11 వ వేతన సవరణ సంఘము ఎంత ఫిట్మెంట్ సిఫార్సు చేసినది? ప్రభుత్వము ఎంత ఇచ్చినది?

జవాబు : శ్రీ అశుతోష్ మిశ్రా కమిటీ I.R. ఇప్పటికే 27% ప్రకటించారు, కనుక 27% ఫిట్మెంట్ ఇవ్వవచ్చునని సిఫార్సు చేసినది. గౌ|| ముఖ్యమంత్రి జనవరి 7న ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత “23%” ఫిట్మెంటు ఫైనల్ చేయటం జరిగినది. ప్రభుత్వ దయనీయ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఇంతకంటే ఎక్కువ ‘ఇవ్వలేమని’ గౌ|| C.M. గారు తన అశక్తతను వెలిబుచ్చారు.

ప్రశ్న: 11 వ వేతన సవరణ సంఘము సిఫార్సుల అమలుపై ప్రభుత్వము ఏ ఏ జి.ఓ.లను విడుదల చేసినది?

జవాబు : ఫిట్మెంట్, మాస్టరుస్కేలు, HRA తదితర అంశాలపై సమగ్రంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జి.ఓ. నెం.1 తేది 17-1-2022 కు విడుదల చేసినది. అలాగే పెన్షనర్లకు జి.ఓ.నెం. 2 తేది 17-1-2022 కు విడుదల చేసినది.

ప్రశ్న : RPS – 2022 లో అప్రయత్న పదోన్నతి పధకము (AAS) లో వచ్చిన మార్పులేవి?

జవాబు : గతంలో వలె 6/12/18/24 సం||ల స్కేళ్ళతో ఉండిన 4 అంచెల AAS కు 6/ 12/ 18/ 24/ 30 సం|| స్కేళ్ళతో 5 అంచెల | AAS ను ప్రవేశపెట్టటం జరుగును. ఎటువంటి పదోన్నతి రాకుండా ఒకే పోస్టులో 30 సం||లు పనిచేసినవారిని ఒక ఇంక్రిమెంటుతో 24 సం||ల స్కేలుతో ఇవ్వబడును. ఇది (24సం॥) స్కేలులో ఒక ఇంక్రిమెంటు ఇవ్వబడును. వివరణ జి.ఓ. రావలసి ఉన్నది. అయితే జి.ఓ.నెం. 1 లో ఆర్డినరీ స్కేలు, స్పెషల్ గ్రేడ్ స్కేలు, ఇవ్వబడినవి. SPP-IIB వలన (30 సం||ల స్కేలు) ఎయిడెడ్ ప్రాధమిక పాఠశాలల్లో దీర్ఘకాలముగా పదోన్నతి అవకాశం లేని టీచర్లు ఉపయోగము.

Flash...   జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ..ఈ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు?

ప్రశ్న : RPS – 2022 లో సిటీ కాంపెన్సెటరీ ఎలవెన్సు (CCA) ఎలా ఇవ్వబడును?

జవాబు : జి.ఓ.నెం. 1 ఆర్ధిక తేది 17-1-2022 ఈ ఎలవెన్సును తొలగించారు. ఫిబ్రవరి 4, 5 తేదీలలో జరిగిన చర్చలలో RPS | 2022 లో కూడా దీనిని పునరుద్ధరించుటకు ప్రభుత్వము అంగీకరించినది. (G.O NO 29 DT 29.2.2022)

ప్రశ్న : RPS 2022 లో (11 PRC) ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏవైనా క్రొత్త సెలవులు ఇవ్వబడినవా?

జవాబు : సెలవు నిబంధనలలో మార్పు చేసి ప్రభుత్వం ఉదారతను చాటుకున్నది. 11 వ PRC చేసిన సిఫార్సులలో ఈ క్రింది వాటిని ప్రభుత్వము ఆమోదించినది. జి.ఓ.నెం. 33, ఆర్థిక తేది. 8-3-2022 విడుదలైనది.

1) బోధనేతర మహిళా ఉద్యోగినులకు కూడా ‘5’ అదనపు సెలవులు ఇవ్వబడును. 

2) ఇద్దరి కన్నా తక్కువ పిల్లలు కలిగియున్న మహిళా ఉద్యోగి ఒక  సంవత్సరము వయస్సు వరకు ఉన్న ‘బిడ్డ’ ను చట్టపరంగా ‘దత్తు’ తీసుకుంటేవారికి 180 రోజుల Child Adoption Leave ఇవ్వబడును. అదేవిధంగా ఒంటరి పురుష ఉద్యోగి అయితే 15 రోజుల పెటర్నిటీలీవు (పితృత్వపు సెలవు) ఇవ్వబడును.

3) స్త్రీ ఉద్యోగినులకు Child Care Leave ను గరిష్టంగా 3 విడతలుగా వాడుకొనుటకు 180 రోజులకు పెంచబడినది. ఈ సౌకర్యము ఒంటరి పురుష ఉద్యోగి (అవివాహిత/భార్య చనిపోయిన/ విడాకులు తీసుకున్న) కూడా కల్పించబడినది. 

4) ఆరోపెడిక్ అంగవైకల్వము ఉండి, ఏవైనా కృత్రిమ పరికరములను (ProstheticAids) ఉపయోగించుచున్న ఉద్యోగులకు 7 అదనపు “స్పెషల్ క్యాజువల్ లీవులు’ ఇవ్వబడును. ఇవే రకపుసెలవులు హైరిస్క్ వార్డులో పనిచేసే ‘నర్సులకు’ కూడా ఇవ్వబడును. ఈ మేరకు జి.ఓ. ||నెం. 33 తేది 8-3-2022 విడుదలైనది.

5) గుండె, కిడ్నీ, క్యాన్సర్, న్యూరో, తదితర Dreadful diseases తో బాధపడుతూ E.O.L లో ఉన్న ఉద్యోగులకు ‘ఎక్స్ గ్రేషియా’ రేట్లను మార్చటమైనది.

పై సెలవులు, సౌలభ్యాలన్నీ జి.ఓ.లు విడుదలైన తేదీల నుండి అమలగును.

ప్రశ్న: ఆరోగ్య కార్డులపై వైద్యము గురించి 11 వ PRC ఏమన్నది? 

జవాబు : 

1) EHS కు ఉద్యోగులు ఇచ్చే చందాను పెంచింది. 

2) హైదరాబాదు, బెంగుళూరు, చెన్నైలో ఉన్న కొన్ని ఆసుపత్రులతో EHS ఒప్పందం చేసుకోవాలి.

3) సర్వీసు / ఫ్యామిలీ పెన్సనర్లకు నెలకు ఇచ్చే మెడికల్ ఎలవెన్సును రూ.300 నుండి రూ.500 లకు పెంచింది.

ప్రశ్న: RPS 2022 లో Daily Allowance, ఇతర అలవెన్సులలో – పెంపుదల ఏవైనా ఉన్నదా?

Flash...   ABOUT 24 YEARS SCALE - PROMOTION FIXATION

జవాబు : 

1) రాష్ట్రం లోపల జరిగే ప్రయాణాలకు DA.ను రూ. 300 ల నుండి రూ 600లకు, రాష్ట్రం బయట జరిగే ప్రయాణాలకు రూ.400 నుండి రూ.800 లకు రోజువారీ DA పెంచబడినది.

2) FTA ను రూ. 1200 నుండి 1700 లకు పెంపు.

3) ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ రూ.2500 లకు పెంపు. 

4) దహన సంస్కారాల ఖర్చు రూ.20,000 లకు పెంపు.

5) ట్రైబల్ ఏరియాలో పనిచేసేవారికి రూ.500 నుండి రూ.1275 వరకు, గరిష్టంగా రూ.700 నుండి రూ.1600 కు పెంచబడినది. 

6) రీడర్స్ ఎలవెన్సు రూ.1200 కు పెంపు.

7) వికలాంగ ఉద్యోగులకుఇచ్చే కన్వేయన్స్ ఎలవెన్సు గరిష్టము రూ. 2000 లకు పెంపు.

పైవన్నీ జి.ఓ.లు ఇచ్చిన తేదీ నుండి అమలు అగును.

ప్రశ్న: RPS – 2022 లో పింఛనుదారులకు కలిగే ప్రయోజనాలేవి?

జవాబు : 1) ఉద్యోగుల వలె ది. 1-7-2018 నుండి పింఛను+23% ఫిట్మెంట్+30.392% DR తో పింఛను స్థిరీకరణ జరుగును. ది. 1-4-2020 నుండి ఆర్థిక ప్రయోజనము మార్చి 2023 లోపు | 4 విడతలుగా ఇవ్వబడును.

2) జి.ఓ.నెం. 2 తేది 17-1-2022 ప్రకారము జనవరి 2022 నుండి పదవీ విరమణ చెందేవారికి రూ 12 లక్షల నుండి రూ. 16 లక్షలకు గ్రాట్యుటీ పెంచబడును.

3) డెత్ రిలీఫ్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మొదలగు అంశములపై జి.ఓ.నెం. 2 లో ఇచ్చిన ఉత్తర్వులకు త్వరలో సవరణ ఉత్తర్వులు ఇవ్వబడును.

70 నుండి 74 సం॥ల వరకు 7%, 75 నుండి 79 సం॥ల వరకు |12% చొ॥న క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చటకు మంత్రుల కమిటీ ఒప్పుకున్నది. జి.ఓ. నెం. 30 తేది 20-2-2022. అలాగే డెత్ ఉన్నది. (G.O NO 30 Dt 20.2.2022) | రిలీఫ్ కూడా రూ.25000 లకు పెంచబడును. ఉత్తర్వులు రావలసి

ప్రశ్న : RPS – 2022 లో స్పెషల్ పే ల సంగతి ఏమిటి?

జవాబు : కార్యదర్శుల కమిటీ రిపోర్టు ప్రకారము తదుపరి ఉత్తర్వులు/ నివేదిక వచ్చేవరకు పాత స్పెషల్ పే లు కొనసాగును.

ప్రశ్న : 12 వ PRC ఎప్పుడు? 

జవాబు: జి.ఓ. నెం. 1 ప్రకారము ఇకపై కేంద్రప్రభుత్వము |అవలంబించే 10 సం॥ లకు ఒకసారి PRC ను అవలంబిస్తే 2026 | లో PRC మరల ఉండును. కాని ఫిబ్రవరి 4,5 తేదీలలో జరిగిన చర్చలలో గౌ॥ ముఖ్యమంత్రిగారు ఇంతవరకు అవలంబిస్తున్న 5 | సం॥లకు ఒకసారి PRC విధానమునే కొనసాగిస్తామని చెప్పారు. ఈ మాట ప్రకారము 2023 లో 12 వ PRC ది. 1-7-2023 నుండి అమలు లోకి రావాలి. 2024 లో శాసనసభ ఎన్నికలు | వస్తున్నందున 2023 లో మంచి PRC పొందుతామని ఆశిస్తూ

అభినందనలతో..

సి. వి. యస్. మణి PRTU

Cell : 98494 70886