AP New Districts: ఏప్రిల్ 4న కొత్త జిల్లాల అవతరణ.. ముహూర్తం ఖరారు

 AP New Districts: ఏప్రిల్ 4న కొత్త జిల్లాల అవతరణ.. ముహూర్తం ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల పేర్లు, హద్దులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం.. తుది నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 4న ఉదయం 9:05 గంటల నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొత్త జిల్లాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల ఏర్పాటుపై వర్చువల్ గా సమావేశమైన మంత్రివర్గం.. 26 జిల్లాలు, 22 కొత్త రెవెన్యూ డివిజన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ALSO READ:

 SBI ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్

SBI Alert: ఖాతాదారులకు SBI హెచ్చరిక.. 

SBI YONO: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా SBI YONO యాప్..!

తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కొత్త జిల్లాలపై ఉన్నతస్థాయి సమావేశంలో జరిగింది. జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తులు తదితర అంశాలపై భేటీలో చర్చ జరిగింది. రెవెన్యూ డివిజన్ల విషయంలో పలువురు ప్రజాప్రతినిథుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సమావేశంలో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు వర్చువల్ గా హాజరై కొత్త జిల్లాలకు ఆమోదించినట్లు సమాచారం. భేటీకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ప్లానింగ్‌ సెక్రటరీ జి విజయకుమార్, ఐటీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, లా సెక్రటరీ వి సునీత ఇతర ఉన్నతాధికారులు హాజయ్యారు.

Flash...   భారత్‌లో కరోనా మరణాలు తక్కువ ఉండడానికి కారణం ఇదేనట..!

ఇదిలా ఉంటే ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల అతరణకు ముహూర్తం నిర్ణయించడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల కోసం ఇప్పటికే భవనాల ఎంపిక పూర్తైంది. ఎంపిక చేసిన భవనాల్లో వసతులకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.

ALSO READ:

APGLI Final Payment Calculator

ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్!

SBI CLERKS , PO పోస్టులకు నోటిఫికేషన్‌.. అర్హత, దరఖాస్తు వివరాలివే

సున్నా రూపాయి నోటు ఉందని మీకు తెలుసా? ఎందుకో తెలుసా